రాకా'.. అదే జరిగితే.. అల్లు అర్జున్ కెరీర్ లోనే
Actor ProfileActor

రాకా'.. అదే జరిగితే.. అల్లు అర్జున్ కెరీర్ లోనే

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
రాకా'.. అదే జరిగితే.. అల్లు అర్జున్ కెరీర్ లోనే
Chitrajyothy1 Nov 2026
రాకా'.. అదే జరిగితే.. అల్లు అర్జున్ కెరీర్ లోనే

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న అత్యంత ప్రతిష్ఠాత్మక చిత్రాల్లో 'రాకా' ఒకటి. స్టార్ దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్న ఈ భారీ బడ్జెట్ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) నటిస్తున్న అత్యంత ప్రతిష్ఠాత్మక చిత్రాల్లో 'రాకా' (Raakaa) ఒకటి. స్టార్ దర్శకుడు అట్లీ (Atlee) తెరకెక్కిస్తున్న ఈ భారీ బడ్జెట్ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా గురించి తాజాగా వినిపిస్తున్న ఓ వార్త సినీ వర్గాల్లో ఆసక్తిని పెంచుతోంది. ఈ చిత్రంలో అల్లు అర్జున్ ఏకంగా నాలుగు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారట. తాత, తండ్రి, ఇద్దరు కుమారులుగా ఆయన నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వార్త నిజమైతే, అల్లు అర్జున్ కెరీర్‌లో తొలిసారి ఒకే సినిమాలో నాలుగు పాత్రలను పోషించిన హీరోగా నిలవనున్నారు. ఈ కథను అనుకున్నప్పుడు అట్లీ తాత, తండ్రి పాత్రలకు వేర్వేరు నటులను తీసుకోవాలని భావించారట. అయితే కథను పూర్తిగా విన్న అల్లు అర్జున్ ఆ నాలుగు పాత్రలను తానే చేయాలని ఆసక్తి వ్యక్తం చేశారట. ఆ తర్వాత నిర్వహించిన లుక్ టెస్టుల్లో నాలుగు పాత్రల్లోనూ ఆయన వైవిధ్యం బాగా కనిపించడంతో, అదే సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా మారుతుందని చిత్రబృందం భావించినట్లు టాక్ వినిపిస్తోంది. అయితే ఈ విషయంపై చిత్ర యూనిట్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె కథానాయికగా నటిస్తున్నారు. భారీ స్థాయి యాక్షన్, భావోద్వేగాలు, అత్యాధునిక విజువల్ ఎఫెక్ట్స్‌తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు ఇప్పటికే అట్లీ వెల్లడించారు. ప్రపంచ సినీ ప్రేక్షకులు ఇప్పటివరకు చూడని స్థాయి విజువల్ అనుభూతిని అందించడమే లక్ష్యంగా చిత్రాన్ని రూపొందిస్తున్నామని ఆయన చెప్పిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ముంబైలో కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. భారీ నిర్మాణ విలువలతో తెరకెక్కుతున్న 'రాకా'ను 2027లో