
సూపర్‌స్టార్ రజనీకాంత్(Rajinikanth), బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ (Hrithk Roshan) ఒకే ఫ్రేమ్‌లో కనిపించడంతో సినీ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సూపర్‌స్టార్ రజనీకాంత్(Rajinikanth), బాలీవుడ్


సూపర్‌స్టార్ రజనీకాంత్(Rajinikanth), బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ (Hrithk Roshan) ఒకే ఫ్రేమ్‌లో కనిపించడంతో సినీ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సూపర్‌స్టార్ రజనీకాంత్(Rajinikanth), బాలీవుడ్

ఓ ఆర్థిక వివాదంలో తమిళ స్టార్ హీరో ఆర్య (Arya) పేరు వినిపించడం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఓ ఆర్థిక వివాదంలో తమిళ స్టార్ హీరో ఆర్య (Arya) పేరు వినిపించడం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన ఆర్యపై హైదరాబాద్‌లో క్రిమినల్ కేసు నమోదు అయింది. ఓ సినిమా నిర్మాణానికి సంబంధించిన కెమెరా ఎక్విప్మెంట్ అద్దె చెల్లింపుల విషయంలో తలెత్తిన వివాదం ఈ కేసుకు కారణమైనట్లు తెలుస్తోంది. తాహెర్ సినీ టెక్నిక్ సంస్థ, తమకు రావాల్సిన సుమారు రూ.1.80 కోట్ల బకాయిలు ఇప్పటికీ చెల్లించలేదని ఆరోపిస్తూ పోలీసులను ఆశ్రయించింది.ఈ ఫిర్యాదు ఆధారంగా హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పోలీసులు ఆర్యతో పాటు ఆయన నిర్మాణ బృందానికి చెందిన కొందరిపై క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు సమాచారం. పలుమార్లు బకాయిలు చెల్లించాలని కోరినా స్పందన రాలేదని, డబ్బుల రికవరీ కోసం తమ ప్రతినిధులు సంప్రదించిన సమయంలో హీరో ఆర్యతో పాటు నిర్మాత వినోద్, మరో సహాయకుడు కిషోర్ అనుచితంగా ప్రవర్తించారని, బెదిరింపులకు కూడా పాల్పడ్డారని తాహెర్ సినీ టెక్నిక్ యాజమాన్యం ఆరోపించింది. ఈ వ్యవహారంపై ప్రస్తుతం పోలీసులు ప్రాథమిక దర్యాప్తు చేపట్టినట్లు తెలుస్తోంది. ఫిర్యాదులో పేర్కొన్న అంశాలపై సంబంధిత పత్రాలు, లావాదేవీల వివరాలను పరిశీలించి తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అయితే, ఈ ఆరోపణలపై హీరో ఆర్య , ఆయన బృందం నుంచి ఇప్పటివరకు అధికారిక స్పందన వెలువడలేదు. వారి వివరణ వచ్చిన తర్వాతే ఈ వివాదంపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది