యువతే టార్గెట్ .. రాహుల్ గాంధీ రాజకీయ వ్యూహంలో కొత్త మార్పు
Actor ProfilePolitician

యువతే టార్గెట్ .. రాహుల్ గాంధీ రాజకీయ వ్యూహంలో కొత్త మార్పు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
యువతే టార్గెట్ .. రాహుల్ గాంధీ రాజకీయ వ్యూహంలో కొత్త మార్పు
AP7AM26 Jan 2027
యువతే టార్గెట్ .. రాహుల్ గాంధీ రాజకీయ వ్యూహంలో కొత్త మార్పు

పెద్ద సభలు.. భారీ ప్రసంగాలు.. రాజకీయ నినాదాలు. ఇలాంటి సంప్రదాయ ప్రచారానికి భిన్నంగా కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఇప్పుడు యువతతో నేరుగా మాట్లాడుతున్నారు. ముఖ్యంగా జనరేషన్‌-జెడ్‌ (జెన్‌-జీ), యువతులు ఎదుర్కొంటున్న సమస్యలపై వారితో ముఖాముఖి చర్చిస్తున్నారు. సోషల్‌ మీడియా వేదికగానూ అదే తరహా సంభాషణకు ప్రాధాన్యం ఇస్తున్నారు.విద్యార్థుల సమస్యల నుంచి..యువతను చేరుకునే ఈ ప్రయత్నం ‘ఛాత్రోంకీ గూంజ్‌’ కార్యక్రమంతో మరింత ఊపందుకుంది. పోటీ పరీక్షల ఒత్తిడి, పేపర్‌ లీకులు, విద్యా వ్యవస్థలో జాప్యం వంటి సమస్యలపై ఇందులో చర్చలు జరిగాయి. కోటా, డెహ్రాడూన్‌, ప్రయాగ్‌రాజ్‌ వంటి కేంద్రాల్లో మొదలైన ఈ కార్యక్రమం క్రమంగా విస్తరించింది.యువతులపై ప్రత్యేక దృష్టిఇటీవల పూణెలో జరిగిన కార్యక్రమాల్లో రాహుల్‌ గాంధీ యువతుల సమస్యలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. కెరీర్‌లో ఎదురయ్యే అడ్డంకులు, భద్రత, ఉద్యోగ ప్రదేశాల్లో పరిస్థితులు, కుటుంబం, సమాజం విధించే ఆంక్షలపై వారితో మాట్లాడారు.సమాజం తమను ఎలా చూస్తోంది? భయాన్ని ఎలా ఉపయోగిస్తున్నారు? ఎలాంటి హింసను ఎదుర్కొంటున్నారు? అది ఎక్కడ జరుగుతోంది? వంటి అంశాలపై యువతులు తమ అనుభవాలను పంచుకోవాలని రాహుల్‌ కోరారు.వ్యక్తిగత అనుభవాలే చర్చకు బాటమహిళా సహచరులు పంచుకున్న వ్యక్తిగత అనుభవాలను కూడా రాహుల్‌ గాంధీ చర్చకు తీసుకొచ్చారు. శ్రద్ధ పేరుతో నియంత్రణ, చిన్న వయసులో పెళ్లి, పితృస్వామ్య భావజాలం, నైతిక పోలిసింగ్‌, భద్రత, వైద్య సదుపాయాల కొరత, వ్యక్తిగత నిర్ణయాలపై ఆంక్షల వంటి అంశాలు చర్చకు వచ్చాయి.సోషల్‌ మీడియాలో కొత్త పంథాడిజిటల్‌ వేదికల్లోనూ ఇదే విధానాన్ని అనుసరిస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రశ్నలు-సమాధానాలు, రీల్స్‌ వంటి సులభమైన ఫార్మాట్లతో యువతను