యూ-టర్న్ తీసుకున్న తమిళనాడు ప్రభుత్వం.. విద్యార్థుల నిరసనల
Actor ProfilePolitician

యూ-టర్న్ తీసుకున్న తమిళనాడు ప్రభుత్వం.. విద్యార్థుల నిరసనల

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
యూ-టర్న్ తీసుకున్న తమిళనాడు ప్రభుత్వం.. విద్యార్థుల నిరసనలపై నిషేధాజ్ఞల ఉపసంహరణ
AP7AM15 Jan 2027
యూ-టర్న్ తీసుకున్న తమిళనాడు ప్రభుత్వం.. విద్యార్థుల నిరసనలపై నిషేధాజ్ఞల ఉపసంహరణ

తమిళనాడు ప్రభుత్వం విద్యార్థుల ఆందోళనలు, నిరసనలపై జారీ చేసిన వివాదాస్పద ఆదేశాలను వెనక్కి తీసుకుంది. ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు, యువత వివిధ నిరసన కార్యక్రమాలు, ఆందోళనలలో పాల్గొనకుండా అడ్డుకునేందుకు చర్యలు చేపట్టాలంటూ జారీ చేసిన సర్క్యులర్‌ను రద్దు చేస్తున్నట్లు విజయ్ సర్కార్ ప్రకటించింది. ప్రభుత్వం జారీ చేసిన సర్క్యులర్‌లో ముఖ్యంగా లెఫ్ట్ పార్టీలు, కాక్రోచ్ జనతా పార్టీ చేపడుతున్న ఆందోళనల్లో విద్యార్థులు పాల్గొనకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించడంపై విద్యార్థి సంఘాలు, ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. రాజ్యాంగం కల్పించిన నిరసన తెలిపే ప్రాథమిక హక్కును కాలరాసేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపణలు వెల్లువెత్తాయి. దాంతో, ఈ వివాదం తీవ్ర రూపం దాల్చక ముందే స్పందించిన ప్రభుత్వం.. తన నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటూ యు-టర్న్ తీసుకుంది