
Chitrajyothy•7 Dec 2026
యూట్యూబ్ లో కంటెంట్ క్రియేటర్లకు షాక్.. మానిటైజేషన్ కు కొత్త నిబంధనలుయూట్యూబ్ మానిటైజేషన్ కోసం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. కొత్తగా YPPలో చేరే క్రియేటర్లు 8 వేల గంటల వాచ్ టైమ్ లేదా 90 రోజుల్లో 2 కోట్ల షార్ట్స్ వ్యూస్ సాధించాల్సి ఉంటుంది. అయితే ఇప్పటికే యూట్యూట్ పార్ట్ నర్ ప్రోగ్రామ్ (వైపీపీ)లో భాగస్వాములుగా ఉన్న క్రియేటర్లకు కొత్త నిబంధన వర్తించదని సంస్థ పేర్కొంది. కొత్తగా వైపీపీ(YPP)లో చేరే వారికి మాత్రమే వర్తిస్తుందని తెలిపింది. ప్లాట్ఫామ్‌పై నిత్యం అంతకంతకు అంచనాలను మించి పోటీ పెరుగుతున్న నేపథ్యంలో నాణ్యమైన కంటెంట్‌ను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ మార్పులు చేస్తున్నట్లు తెలిపింది. వెయ్యి మంది సబ్‌స్క్రైబర్లు ఉండాలనే నిబంధనలో మాత్రం ఎటువంటి మార్పు ఉండదని స్పష్టం చేసింది. కొత్త నిబంధన 2027 ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి వస్తుందని ప్రకటించింది