యూజర్లకు పండగే.. మరో 2 కొత్త ప్లాన్స్.. ఉచితంగా 15 ప్రీమియం యాప్స్ సహా మరెన్నో
Actor ProfileCelebrity

యూజర్లకు పండగే.. మరో 2 కొత్త ప్లాన్స్.. ఉచితంగా 15 ప్రీమియం యాప్స్ సహా మరెన్నో

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
యూజర్లకు పండగే.. మరో 2 కొత్త ప్లాన్స్.. ఉచితంగా 15 ప్రీమియం యాప్స్ సహా మరెన్నో
Samayam Telugu20 Nov 2026
యూజర్లకు పండగే.. మరో 2 కొత్త ప్లాన్స్.. ఉచితంగా 15 ప్రీమియం యాప్స్ సహా మరెన్నో

Jio New Plans: దేశీయ దిగ్గజ టెలికాం కంపెనీ రిలయన్స్ జియో (Reliance Jio) యూజర్లకు పండగే. జియో తన ఓటీటీ పాస్ పోర్ట్ ఫోలియోను మరింత విస్తరించింది (Jio OTT Pass). ఇప్పటికే28 రోజుల వ్యాలిడిటి గల రూ.200 ఓటీటీ పాస్ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కొత్త మరో 2 ఓటీటీ ప్లాన్లను లాంచ్ చేసింది. కొత్తగా 3 నెలలు, ఏడాది వ్యాలిడిటీతో ఈ ప్లాన్లను ప్రవేశపెట్టింది. రూ.550, రూ.2000 లతో జియో ఓటీటీ ప్లాన్లను అందిస్తోంది. వినోదం కోరుకునే యూజర్లే లక్ష్యంగా, దీర్ఘకాల సబ్‌స్క్రిప్షన్ కోసం ఈ ప్లాన్లను లాంచ్ చేసినట్లు జియో తెలిపింది. మరి ఆ వివరాలు తెలుసుకుందాం.రూ.550 ప్లాన్ వివరాలుకొత్తగా తీసుకొచ్చిన ఈ రెండు ఓటీటీ పాస్‌లను ఆగస్టు 7 నుంచే అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఓ ప్రకటనలో తెలిపింది. రూ.550 ఓటీటీ పాస్‌ ద్వారా 84 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. 90 జీబీ హైస్పీడ్ డేటా లభిస్తుంది. అపరిమిత 5జీ వస్తుంది. అయితే, ఇందులో వాయిస్ కాల్స్ ఉండవు. 3 నెలలు, ఏడాది వ్యాలిడిటీ ఉండే బేస్ ప్లాన్లతో రీఛార్జ్ చేసుకున్న జియో సబ్‌స్క్రైబర్లకు ఈ ప్లాన్ వర్తిస్తుంది.రూ.2000 ప్లాన్ వివరాలుఈక 2000 ఓటీటీ పాస్ రీఛార్జ్ చేసుకుంటే 365 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. దీంతో పాటు 365 జీబీ హైస్పీడ్ డేటా వస్తుంది. అన్‌లిమిటెడ్ 5జీ లభిస్తుంది. ఏడాది బేస్ ప్లాన్ తో రీఛార్జ్ చేసుకున్న వారికి మాత్రమే ఈ ప్లాన్ అందుబాటులో ఉంటుంది. ఇందులోనూ ఎలాంటి వాయిస్ కాల్స్ రావు. 15 ప్రీమియం ఓటీటీ యాప్‌లు, జియో టీవీలో 1000కిపైగా ఛానెళ్లు వీక్షించవచ్చని జియో తెలిపింది. ఈ ప్లాన్ల ద్వారా రూ.1500 విలువైన నెలవారీ ప్రయోజనాలను పొందొచ్చని తెలిపింది. ఈ ప్యాక్ ద్వారా యూజర్లు టీవీ, టాబ్లెట్, మొబైల్ పరికరాల్లో ప్రకటనలు లేకుండా, బ్యాక్ గ్రౌండ్ ప్లే చేస్తూ యూట్యూబ్ ప్రీమియం సైతం యాక్సెస్