
ప్రదీప్ కొండిపర్తి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. యాంకర్ సుమ తనను గురువుగా, స్టేజి ముఖంగా ప్రకటించడాన్ని తాను ఎంతో గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు. సుమ తన దగ్గరే నటన, మాట తీరు నేర్చుకుందని, ఆమె తనకంటే చాలా చిన్నది కాబట్టి తన బిడ్డ లాంటిదని ప్రదీప్ అన్నారు. చాలామంది తమకు సహాయం చేసినవారిని మర్చిపోతారని, కానీ సుమ తనను మర్చిపోలేదని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. సుమ తల్లిదండ్రులు, భర్త రాజీవ్ కూడా తనకు చిన్నప్పటి నుంచీ తెలుసని, వారిద్దరూ పెళ్లి చేసుకుంటే తాను ఎంతో ఆనందించానని ప్రదీప్ గుర్తుచేసుకున్నారు. సుమ క్యారెక్టర్ తనకు ఎందుకు ఇష్టమంటే, ఆమె ఎక్కిన నిచ్చెనను మర్చిపోలేదని, ఆమె కృతజ్ఞత గుణం తనకు నచ్చిందని ఆయన అన్నారు. సుమ కృతజ్ఞతను వివరిస్తూ, ఒక సందర్భంలో స్టార్ మహిళ 1500వ ఎపిసోడ్‌కు తనను అతిథిగా సుమ పిలిచిందని ప్రదీప్ గుర్తుచేసుకున్నారు. అప్పుడు సుమ తనను గురువుగా పరిచయం చేసి, “ఆయన వల్లే నేను అన్నం తింటున్నాను” అని తన కృతజ్ఞతను తెలియజేసిందని చెప్పారు. అప్పుడు తాను సుమతో, “లేదమ్మా, మేము డైరెక్షన్ బోర్డ్ లాగా ఇట్లా వెళ్ళు తల్లి అని చెప్తాము, వెళ్ళినవాడు గొప్పవాడు, డైరెక్షన్ బోర్డ్ గొప్ప కాదు, నీ గొప్పతనం” అని చెప్పినట్లు ప్రదీప్ వివరించారు. ఆ సందర్భంలోనే సుమ, “సార్, తెలుగు మీ దగ్గర నేర్చుకున్నా, ప్రవర్తన మీ దగ్గర నేర్చుకున్నా. మీరు గనక మీలా కాక ఇంకెవరైనా మిస్ బిహేవ్ చేసి ఉంటే నాతో ఎవరైనా, మా నాన్న పంపించేవాడు కాదు. మా నాన్న నాకు ఏం చెప్పాడంటే, ప్రతిరోజు అన్నం తినే ముందు ప్రదీప్ గారి పేరు తలుచుకు తిను అని చెప్పాడు” అని చెప్పిన మాట తనకు గుండె కరిగిపోయేలా చేసిందని ప్రదీప్ తెలిపారు. ఇంత కృతజ్ఞత ఎవరికి ఉంటుందని ఆయన అన్నారు. ఇండస్ట్రీలో తన వల్ల పైకి వచ్చినవారు వంద