యూఏఈ ప్రవాసాంధ్రుల కోసం కీలక నియామకం
Actor ProfilePolitician

యూఏఈ ప్రవాసాంధ్రుల కోసం కీలక నియామకం

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
యూఏఈ ప్రవాసాంధ్రుల కోసం కీలక నియామకం
AP7AM6 Dec 2026
యూఏఈ ప్రవాసాంధ్రుల కోసం కీలక నియామకం

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లోని ప్రవాసాంధ్రుల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నియామకం చేపట్టింది. శ్రీపొట్టి శ్రీరాములు జిల్లాకు చెందిన ఎన్నారై దారపనేని ప్రసాద్‌ను యూఏఈలో ఆంధ్రప్రదేశ్‌ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ (ఏపీఎన్ఆర్టీఎస్) కంట్రీ కోఆర్డినేటర్‌గా నియమించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. దుత్తలూరు మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన ప్రసాద్, ఇకపై యూఏఈలోని ప్రవాసాంధ్రుల సంక్షేమం కోసం సేవలందించనున్నారు.ఈ నూతన బాధ్యతల్లో భాగంగా, యూఏఈలో నివసిస్తున్న తెలుగు వారి సంక్షేమ వ్యవహారాలను ప్రసాద్ పర్యవేక్షించనున్నారు. ప్రవాసాంధ్రుల సమస్యలు, ఫిర్యాదుల పరిష్కారంలో చొరవ చూపుతూ వారికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తారు. ఏపీఎన్ఆర్టీఎస్, భారత రాయబార కార్యాలయం, యూఏఈలోని స్థానిక అధికారులతో సమన్వయం చేసుకుంటూ పనిచేసే బాధ్యతలను ప్రభుత్వం ఆయనకు అప్పగించింది.ఈ నియామకం ద్వారా యూఏఈలోని ప్రవాసాంధ్రులకు ప్రభుత్వపరమైన సేవలు, సహాయం మరింత వేగంగా అందుతాయని అధికార యంత్రాంగం భావిస్తోంది