యూఏఈ నుంచి కీలక నిందితుడిని భారత్ కు రప్పించిన ఎన్ సీబీ
Actor ProfilePolitician

యూఏఈ నుంచి కీలక నిందితుడిని భారత్ కు రప్పించిన ఎన్ సీబీ

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
యూఏఈ నుంచి కీలక నిందితుడిని భారత్ కు రప్పించిన ఎన్ సీబీ
AP7AM21 Dec 2026
యూఏఈ నుంచి కీలక నిందితుడిని భారత్ కు రప్పించిన ఎన్ సీబీ

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వేల కోట్ల రూపాయల డ్రగ్స్ కేసులో మోస్ట్ వాంటెడ్ నిందితుడు, కీలక సూత్రధారి వీరేందర్ సింగ్ బసోయాను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) అధికారులు భారత్‌కు రప్పించారు. యూఏఈలో తలదాచుకుంటున్న అతడిని అక్కడ అరెస్ట్ చేసి ఢిల్లీకి తరలించారు. ఈ విషయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆగస్టు 14న అధికారికంగా వెల్లడించారు.పుణెలో పట్టుబడిన సుమారు 1,837 కిలోల మెఫిడ్రోన్ (విలువ రూ.6,000 కోట్లు), ఢిల్లీలో బయటపడిన దాదాపు రూ.13,000 కోట్ల విలువైన డ్రగ్స్ కేసులతో వీరేందర్ బసోయాకు ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయి. మాదకద్రవ్యాలను విదేశాలకు అక్రమంగా తరలించడంలో అతడు కీలక సమన్వయకర్తగా వ్యవహరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. 2024 ఫిబ్రవరిలో పూణె డ్రగ్స్ రాకెట్ వెలుగులోకి వచ్చిన తర్వాత బసోయా భారత్ నుంచి పరారయ్యాడు.ఎన్‌సీబీ అభ్యర్థన మేరకు ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయడంతో, ఈ ఏడాది జూన్‌లో యూఏఈ పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. అనంతరం అతడిని భారత్‌కు అప్పగించగా, ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎన్‌సీబీ అధికారులు అదుపులోకి తీసుకుని అధికారికంగా అరెస్ట్ చేశారు. ఢిల్లీలోని సరోజినీ నగర్ నివాసి అయిన బసోయా కుమారుడు రిషబ్ బసోయాను కూడా భారత్‌కు రప్పించేందుకు అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.మాదకద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా ప్రభుత్వం అనుసరిస్తున్న "జీరో టాలరెన్స్" విధానంలో ఇది ఒక కీలక మైలురాయి అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. డ్రగ్స్ స్మగ్లర్లు ప్రపంచంలో ఎక్కడ దాక్కున్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. అంతర్జాతీయ