మహేష్ బాబుకు అమ్మగా నటించాలని ఉంది.. ఆ ఛాన్స్ ఎప్పుడొస్తుందో
Actor ProfileActor

మహేష్ బాబుకు అమ్మగా నటించాలని ఉంది.. ఆ ఛాన్స్ ఎప్పుడొస్తుందో

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
మహేష్ బాబుకు అమ్మగా నటించాలని ఉంది.. ఆ ఛాన్స్ ఎప్పుడొస్తుందో
TV9 Telugu25 Jan 2027
మహేష్ బాబుకు అమ్మగా నటించాలని ఉంది.. ఆ ఛాన్స్ ఎప్పుడొస్తుందో

ఒకప్పుడు తన అందం అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసిన నటి యమున.అప్పట్లో వరుసగా సినిమాలు చేసిన ఆమె ఆతర్వాత ఊహించని విధంగా గ్యాప్ తీసుకున్నారు. ఇక ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో వరుసగా సీరియల్స్ లో నటిస్తూ బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. కాగా ఓ ఇంటర్వ్యూలో యమున మాట్లాడుతూ.. తన కెరీర్ ప్రారంభ దశలో ఇతర నటీమణులకు తాను పోటీ కాదని, తన పాత్రలన్నీ ప్రత్యేకమైనవని అన్నారు. ఎందుకంటే తాను గ్లామర్ పాత్రలకు దూరంగా, విభిన్నమైన క్యారెక్టర్లు చేశానని, అందుకే ఎవరూ తనను పోటీగా భావించలేదని తెలిపారు. దర్శకుడు దాసరి నారాయణ రావుతో తనకున్న బలమైన అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ, "మామగారు" సినిమా పెద్ద హిట్ అయిన తర్వాత దాసరి సినిమాల్లో తాను ఎక్కువగా నటించే అవకాశం లభించిందని చెప్పారు. అయితే, ఒకే రకమైన పాత్రలు తన వద్దకు వచ్చేవని, "నాగమ్మ" తర్వాత చాలా పాము సబ్జెక్ట్ సినిమాలు వచ్చాయని వివరించారు. శ్రీహరి చనిపోయిన తర్వాత క్లోజ్ ఫ్రెండ్సే సగం ఆస్తులు కాజేశారు.. నన్ను ఎవ్వరూ పట్టించుకోలేదు ఇటీవల మళ్లీ సినిమాలు చేస్తారని కొందరు ఆశించినప్పటికీ, తాను సీరియల్స్‌తో బిజీగా ఉండడం వల్ల అవకాశాలను అందుకోలేకపోయానని అన్నారు. సీరియల్స్‌లో నటించడం తనకు ఎంతో సౌకర్యంగా ఉందని, ఒకే చోట, కుటుంబ వాతావరణంలో పనిచేయడం ఇష్టమని ఆమె వివరించారు. పాత్రల విషయంలో తనకు ఎలాంటి పరిమితులు లేవని యమున అన్నారు. "అమ్మ" పాత్రలు, "అక్క" పాత్రలు చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని, 20 ఏళ్ల క్రితమే తాను ఒక సీరియల్‌లో బామ్మ పాత్ర చేశానని గుర్తుచేసుకున్నారు. Madhuri Rathod: అందుకే అలాంటి పాటల్ని సెలక్ట్ చేసుకున్నా.. వాటితోనే క్రేజ్ తెచ్చుకున్నా : మాధురి రాథోడ్ చిరంజీవి వంటి అగ్ర హీరోలకు అమ్మగా నటించే అవకాశం వస్తే తప్పకుండా చేస్తానని, అయితే అది ఎంతవరకు సరిపోతుందో తెలియదని నవ్వుతూ అన్నారు. మహేష్ బాబు వంటి హీరోలకు అమ్మగా నటించాలని తనకు