మహేష్ చిన్ననాటి పాత్రలో తారక్ తనయుడు?... సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 'వారణాసి' లీక్
Actor ProfileActor

మహేష్ చిన్ననాటి పాత్రలో తారక్ తనయుడు?... సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 'వారణాసి' లీక్

📊 Box Office Collections
Total News2
Movie Updates0
Sources1
ఎనిమిది మందితో ప్రేమాయణం... పెళ్లి కాకపోయినా తల్లినయ్యా.. షకీలా జీవితంలో ఇన్ని కష్టాలా
Samayam Telugu31 Oct 2026
ఎనిమిది మందితో ప్రేమాయణం... పెళ్లి కాకపోయినా తల్లినయ్యా.. షకీలా జీవితంలో ఇన్ని కష్టాలా

వెండితెరపై ఒకప్పుడు తన గ్లామర్‌తో, బోల్డ్ పాత్రలతో సంచలనం సృష్టించిన నటి షకీలా జీవితం వెనుక ఎన్నో గుండెల్ని పిండేసే కష్టాలు ఉన్నాయి. అప్పట్లో స్టార్ హీరోల చిత్రాలకు ధీటుగా తన సినిమాలతో థియేటర్ల వద్ద

మహేష్ చిన్ననాటి పాత్రలో తారక్ తనయుడు?... సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 'వారణాసి' లీక్
Samayam Telugu31 Oct 2026
మహేష్ చిన్ననాటి పాత్రలో తారక్ తనయుడు?... సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 'వారణాసి' లీక్

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, గ్లోబల్ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ' వారణాసి 'పై రోజురోజుకూ అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పటికే విడుదలైన టైటిల్ టీజర్ అభిమానులకు పూనకాలు తెప్పించగా, తాజాగా సోషల్ మీడియాలో ఒక సెన్సేషనల్ న్యూస్ తెగ హల్‌చల్ చేస్తోంది. ఈ చిత్రంలో ఒక కీలక పాత్ర కోసం టాలీవుడ్ టాప్ స్టార్ వారసుడు ఎంట్రీ ఇవ్వబోతున్నాడనే ప్రచారం జోరందుకుంది. ఆ స్టార్ కిడ్ మరెవరో కాదు.. మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ పెద్ద కుమారుడు అభయ్ రామ్ .* ‘లెనిన్’ హిట్‌తో మారిన భాగ్యశ్రీ బోర్సే జాతకం.. ‘ఐరన్ లెగ్’ ముద్ర చెరిపేసిన భారతి నెట్టింట వైరల్ అవుతున్న లీకుల ప్రకారం.. 'వారణాసి' చిత్రంలో మహేష్ బాబు చిన్ననాటి పాత్ర చాలా కీలకంగా ఉండబోతోందట. ఈ పాత్ర కోసం ఎవరిని పెడితే బాగుంటుందా అని ఆలోచించిన జక్కన్న, ఆఖరికి తారక్ కుమారుడు అభయ్ రామ్‌ను ఎంపిక చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ఎన్టీఆర్‌తో రాజమౌళికి ఉన్న ఆత్మీయ అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ క్రమంలోనే రాజమౌళి అడగడమే ఆలస్యం, మహేష్ సినిమాలో తన కొడుకు నటనకు తారక్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే.. మహేష్-ఎన్టీఆర్ అభిమానులకు అంతకంటే పెద్ద పండగ మరొకటి ఉండదనే చెప్పాలి. రాముడిగా సూపర్ స్టార్ఈ ప్రతిష్టాత్మక చిత్రం 'టైమ్ ట్రావెల్' వినూత్న కథాంశంతో తెరకెక్కుతోందని చిత్రబృందం ఇప్పటికే స్పష్టం చేసింది. ఇందులో భాగంగానే సూపర్ స్టార్ మహేష్ బాబు పలు విభిన్నమైన లుక్స్‌లో కనిపించి అలరించనున్నారు. మరీ ముఖ్యంగా, ఇందులో మహేష్ బాబు 'శ్రీరాముడి' గెటప్‌లో కనిపించబోతున్నారనే విషయాన్ని రాజమౌళి స్వయంగా హింట్ ఇచ్చారు. రాముడి రూపంలో మహేష్ అద్భుతంగా ఒదిగిపోయారని జక్కన్న ప్రశంసించడంతో సినిమాపై క్యూరియాసిటీ మరింత పెరిగింది.* ‘హైదరాబాద్ నా కర్మ