మహారాష్ట్రలో భారీ వర్షాలు.. కొండచరియలు విరిగిపడి ఇద్దరి మృతి
Actor ProfilePolitician

మహారాష్ట్రలో భారీ వర్షాలు.. కొండచరియలు విరిగిపడి ఇద్దరి మృతి

📊 Box Office Collections
Total News3
Movie Updates0
Sources1
అయోధ్య రామ మందిర విరాళాల చోరీ కేసులో కీలక పరిణామం
Andhra Jyothy28 Sept 2026
అయోధ్య రామ మందిర విరాళాల చోరీ కేసులో కీలక పరిణామం

అయోధ్య రామ మందిర విరాళాల చోరీ నేపథ్యంలో దేవాలయ ట్రస్టు జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ రాజీనామాను ట్రస్టు బోర్డు తాజాగా ఆమోదించింది. ఇంటర్నెట్ డెస్క్: అయోధ్య రామ మందిర విరాళాల చోరీ కేసు నేపథ్యంలో దేవాలయ

తాజ్ మహల్ వివాదం.. కేంద్రం, ఏఎస్ఐకు హైకోర్టు నోటీసులు
Andhra Jyothy27 Sept 2026
తాజ్ మహల్ వివాదం.. కేంద్రం, ఏఎస్ఐకు హైకోర్టు నోటీసులు

తాజ్ మహల్ వివాదానికి సంబంధించి అలహాబాద్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. 'తేజో మహాలయ' పిటిషన్‌పై కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వం, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI)కు నోటీసులు

మహారాష్ట్రలో భారీ వర్షాలు.. కొండచరియలు విరిగిపడి ఇద్దరి మృతి, ఒకరి గల్లంతు
Andhra Jyothy27 Sept 2026
మహారాష్ట్రలో భారీ వర్షాలు.. కొండచరియలు విరిగిపడి ఇద్దరి మృతి, ఒకరి గల్లంతు

భారీ వర్షాలు మహారాష్ట్రను కుదిపేస్తున్నాయి. ఎడతెరిపి లేని వానలతో పుణె జిల్లా మావల్ తహసీల్‌లోని పటాన్‌లో సోమవారం తెల్లవారుజామున 4:25 గంటలకు పలు ఇళ్లపై కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో ఇద్దరు మృతిచెందగా, ఒకరు గల్లంతయ్యారు. మహారాష్ట్ర: భారీ వర్షాలు మహారాష్ట్రను కుదిపేస్తున్నాయి. ముంబై, పుణె, థానే, రాయగడ్ ప్రాంతాలు వానలకు అతలాకుతలం అవుతున్నాయి. భారీ వర్షాలకు ఇవాళ (సోమవారం) తెల్లవారుజామున కొండచరియలు విరిగిపడి ఇద్దరు ప్రాణాలు కోల్పోగా.. ఒకరు గల్లంతయ్యారు. ఎడతెరిపి లేని వానలతో పుణె జిల్లా మావల్ తహసీల్‌లోని పటాన్‌లో ఈరోజు తెల్లవారుజామున 4:25 గంటలకు పలు ఇళ్లపై కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో సుమారు 30 నుంచి 35 మంది గ్రామస్థులు శిథిలాల కింద చిక్కుకుపోయారు. బాధితుల్లో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మరణించగా, మరొకరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. బాధితులను నందు టికోన్ (60), మౌలి టికోన్ (30), అనితా టికోన్ (55)గా పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్‌డీఆర్‌ఎఫ్) ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. రాష్ట్రంలో వర్షాల కారణంగా ఇప్పటివరకు 10 మంది ప్రాణాలు కోల్పోగా.. వారిలో ఒక్క ముంబైలోనే 8 మంది వివిధ ఘటనల్లో మృతిచెందారు. మరోవైపు, ఈ ఘటనపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ స్పందించారు. కొండచరియలు విరిగిపడ్డాయని, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని సీఎం తెలిపారు. ఈ ఘటనతో ముంబై-పుణె ఎక్స్‌ప్రెస్‌వే, పాత ముంబై-పుణె హైవేపై భారీగా ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడిందని ఆయన వెల్లడించారు. సుమారు 100 టన్నుల శిథిలాలు ఒక్కసారిగా ముంబై-పుణె ఎక్స్‌ప్రెస్‌వేపై పడ్డాయని పేర్కొన్నారు. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడిందని.. ఇప్పటివరకు దాదాపు 70 శాతం శిథిలాలను తొలగించినట్లు సీఎం వివరించారు. పుణె నుంచి ముంబైకి వెళ్లే ట్రాఫిక్ కోసం ఒక లేన్‌ను తిరిగి తెరిచామని, రాబోయే కొన్ని గంటల్లో ఎక్స్‌ప్రెస్‌వే