మస్తుగుందిర యవ్వారం అంటున్న కావ్యా థాపర్
Actor ProfileActor

మస్తుగుందిర యవ్వారం అంటున్న కావ్యా థాపర్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
మస్తుగుందిర యవ్వారం అంటున్న కావ్యా థాపర్
Chitrajyothy17 Dec 2026
మస్తుగుందిర యవ్వారం అంటున్న కావ్యా థాపర్

హవీష్‌ హీరోగా, త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో కాంచన కోనేరు నిర్మించిన చిత్రం 'నేను రెడీ'. ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ విడుదలైంది. యంగ్ హీరో హవీష్‌తో, త్రినాథరావు నక్కిన తెరకెక్కిస్తున్న ఎంటర్‌టైన్మెంట్‌ మూవీ 'నేను రెడీ'. ఇప్పటికే ఈ సినిమా టీజర్, ఫస్ట్ సింగిల్ విడుదలై, చక్కని ఆదరణ పొందడంతో పాటు సినిమాపై అంచనాలు పెంచాయి. తాజాగా ఈ సినిమానుంచి మరో లిరికల్ వీడియో విడుదలైంది. 'మస్తుందిర యవ్వారం' అంటూ సాగే ఈ పాటను కాసర్ల శ్యామ్ రాయగా, మిక్కీ జె మేయర్ స్వర పర్చారు. దీనిని అనురాగ్ కులకర్ణి, మనీషా ఎర్రబత్తిన పాడారు. హీరోహీరోయిన్లు హవీష్‌, కావ్యాథాపర్ తో పాటు డాన్సర్స్ పై విజయ్ పోలకి కొరియోగ్రఫీలో అందమైన లొకేషన్స్ లో ఈ పాటను చిత్రీకరించారు. అతి త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని నిర్మాత కాంచన కోనేరు తెలియచేయనున్నారు