మళ్లీ థియేటర్లలోకి కింగ్ నాగార్జున క్లాసిక్
Actor ProfileActor

మళ్లీ థియేటర్లలోకి కింగ్ నాగార్జున క్లాసిక్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
మళ్లీ థియేటర్లలోకి కింగ్ నాగార్జున క్లాసిక్
Chitrajyothy13 Dec 2026
మళ్లీ థియేటర్లలోకి కింగ్ నాగార్జున క్లాసిక్

అక్కినేని నాగార్జున(Nagarjuna), గిరిజ శెట్టర్‌ జంటగా నటించిన క్లాసిక్‌ చిత్రం ‘గీతాంజలి’ (Geethanjali) మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అక్కినేని నాగార్జున(Nagarjuna), గిరిజ శెట్టర్‌ జంటగా నటించిన క్లాసిక్‌ చిత్రం ‘గీతాంజలి’ (Geethanjali) మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రముఖ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన ఈ ఎవర్‌గ్రీన్‌ ప్రేమకథను ఆగస్టు 28న 4Kలో రీ-రిలీజ్‌ చేయనున్నట్లు మేకర్స్‌ అధికారికంగా ప్రకటించారు. ఇందుకు సంబంధించిన స్పెషల్‌ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. (Geethanjali Re Release) ‘గీతాంజలి’ తెలుగు సినీ చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ప్రేమకథా చిత్రం. ప్రేమ, భావోద్వేగాలు, అనుబంధాలను మణిరత్నం తనదైన శైలిలో తెరకెక్కించారు. నాగార్జున, గిరిజ శెట్టర్‌ మధ్య కెమిస్ట్రీ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ముఖ్యంగా సినిమాలోని భావోద్వేగ సన్నివేశాలు ఇప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ఈ సినిమాకు ఇళయరాజా అందించిన సంగీతం మరో ప్రత్యేకత. సినిమాలోని పాటలు అప్పట్లో ఎంతగా హిట్‌ అయ్యాయో.. ఇప్పటికీ అంతే ఆదరణ పొందుతున్నాయి. ప్రేమకథకు ఇళయరాజా సంగీతం మరింత అందాన్ని తీసుకొచ్చింది. పి.సి. శ్రీరామ్‌ సినిమాటోగ్రఫీ సినిమాకు ప్రత్యేకమైన విజువల్‌ ఫీల్‌ను తీసుకొచ్చింది. బి. లెనిన్‌, వి.టి. విజయన్‌ ఎడిటింగ్‌, తోట తరణి ఆర్ట్‌ డైరెక్షన్‌ సినిమాను మరింత అందంగా తీర్చిదిద్దాయి. ఇప్పుడు ఈ క్లాసిక్‌ చిత్రం 4K క్వాలిటీతో మరోసారి థియేటర్లలోకి వస్తుండటంతో నాగార్జున అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. అప్పట్లో థియేటర్లలో ‘గీతాంజలి’ని చూసిన వారికి ఇది పాత జ్ఞాపకాలను మరోసారి గుర్తు చేయనుంది. అదే సమయంలో కొత్త తరం ప్రేక్షకులకు ఈ క్లాసిక్‌ ప్రేమకథను పెద్ద తెరపై ఆస్వాదించే అవకాశం లభించనుంది. ఆగస్టు 28న ‘గీతాంజలి’ 4Kలో రీ-రిలీజ్‌ కానుండటంతో కింగ్‌ నాగార్జున అభిమానులు, మణిరత్నం సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మంచి ప్రేమకథలకు కాలంతో సంబంధం లేదని మరోసారి నిరూపించేందుకు ‘గీతాంజలి’ సిద్ధమవుతోంది. స్పా సెంటర్ లో నటికి ఏం జరిగిందంటే.. Raviteja