మళ్లీ కొండా సురేఖ డుమ్మా.. రేవంత్ రెడ్డి
Actor ProfilePolitician

మళ్లీ కొండా సురేఖ డుమ్మా.. రేవంత్ రెడ్డి

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
మళ్లీ కొండా సురేఖ డుమ్మా.. రేవంత్ రెడ్డిపై ఇంకా చల్లారని అసంతృప్తి
Zee Telugu1 Jan 2027
మళ్లీ కొండా సురేఖ డుమ్మా.. రేవంత్ రెడ్డిపై ఇంకా చల్లారని అసంతృప్తి

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Warangal Politics: తెలంగాణ కాంగ్రెస్‌లో ఇంకా భేదాభిప్రాయాలు తారస్థాయిలో ఉన్నాయి. క్షేత్రస్థాయిలోనే కాదు అత్యున్నత పదవుల్లో ఉన్న వారి మధ్య కూడా విభేదాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా వరంగల్‌ జిల్లా కాంగ్రెస్‌ పార్టీలో తీవ్ర స్థాయిలో లుకలుకలు ఉన్నాయి. పరకాల బహిరంగ సభతో అవి మరింత ముదిరాయని స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యమంత్రి హాజరైన సభకు కీలక శాఖకు మంత్రి అయిన కొండా సురేఖ డుమ్మా కొట్టారు. రేవంత్‌ రెడ్డిపై కొండా దంపతులు ఇంకా అసంతృప్తి.. ఆగ్రహంతో ఉన్నారని మరోసారి రుజువైంది. ములుగురు జిల్లాలో రేవంత్ రెడ్డి విస్తృత స్థాయి పర్యటన చేశారు. మేడారం సమ్మక్క, సారక్క ఆలయాన్ని సందర్శించడమే కాకుండా ములుగు జిల్లా కలెక్టర్‌ కార్యాలయాన్ని సీఎం హోదాలో రేవంత్‌ రెడ్డి ప్రారంభించారు. ఇక అనంతరం పరకాలలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఇది కొండా సురేఖ నియోజకవర్గం పక్కన ఉన్నదే. కానీ ఏ కార్యక్రమంలోనూ కొండా సురేఖ పాల్గొనలేదు. రేవంత్‌ రెడ్డి కార్యక్రమానికి ఆమె దూరంగా ఉండడం చర్చనీయాంశంగా మారింది. దేవాదాయ శాఖకు చెందిన కార్యక్రమంలో కూడా దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న కొండా సురేఖ హాజరుకాలేదు. మేడారం జాతర పనుల పరిశీలనకు వచ్చిన రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధిత శాఖ మంత్రిగా కొండా సురేఖ డుమ్మా కొట్టడంతో చర్చనీయాంశంగా మారింది. మేడారం జాతరతోపాటు మరికొన్ని అంశాలపై రేవంత్‌ రెడ్డితోపాటు పొంగులేటి శ్రీనివాస రెడ్డితో కొండా సురేఖకు విబేధాలు కొనసాగుతున్నాయి. రేవంత్‌ రెడ్డి, పొంగులేటిపై కొండా సురేఖ కుమార్తె గతంలో బహిరంగంగా సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇక జిల్లాలో ఉన్న మరో మంత్రి సీతక్కతో కూడా