మళ్లీ అస్వస్థతకు గురయిన పవన్ కల్యాణ్ .. వెంటనే హైదరాబాద్ కు పయనం
Actor ProfilePolitician

మళ్లీ అస్వస్థతకు గురయిన పవన్ కల్యాణ్ .. వెంటనే హైదరాబాద్ కు పయనం

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
మళ్లీ అస్వస్థతకు గురయిన పవన్ కల్యాణ్ .. వెంటనే హైదరాబాద్ కు పయనం
Zee Telugu25 Dec 2026
మళ్లీ అస్వస్థతకు గురయిన పవన్ కల్యాణ్ .. వెంటనే హైదరాబాద్ కు పయనం

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Pawan Kalyan High Fever: ఇప్పుడిప్పుడే అనారోగ్యం నుంచి కోలుకుంటున్న జనసేన పార్టీ అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ మళ్లీ అనారోగ్యానికి గురయ్యారు. స్వాతంత్య్ర వేడుకలకు హాజరైన ఆయన బిజీ బిజీగా గడిపారు. కానీ వెంటనే అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర జ్వరం బారిన పడడంతో ఆయన గవర్నర్‌ మర్యాదపూర్వకంగా నిర్వహించే ఎట్‌ హోమ్‌ కార్యక్రమానికి దూరమయ్యారు. వెంటనే హైదరాబాద్‌కు బయల్దేరారు. రాజమండ్రి పర్యటనకు వచ్చిన సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అస్వస్థతకు గురయ్యారు. కాకినాడలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న అనంతరం రోడ్డు మార్గంలో రాజమండ్రికి చేరుకున్నార. ధవళేశ్వరం ప్రభుత్వ కలప డిపో వద్ద అటవీశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సెంట్రల్‌ క్రాఫ్ట్‌ వుడ్‌ బ్యాంక్‌ను ఆయన ప్రారంభించారు. ఆ సమయంలో జ్వరం తీవ్రం కావడంతో కార్యక్రమాన్ని మధ్యలోనే ముగించుకున్నారు. కాసేపు విశ్రాంతి అనంతరం రాజమండ్రి నుంచి నేరుగా హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. ఇటీవల కుడి భుజానికి ఆపరేషన్ చేయించుకున్న పవన్ కల్యాణ్‌ ఇవాళ పర్యటన సందర్భంగా చేతికి సంబంధించిన ఇబ్బంది ఏర్పడినట్లు కనిపించింది. ఫిజియోథెరపీ వైద్య నిపుణుల సూచనలు తీసుకుంటారని ఉప ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ప్రకటనలో తెలిపారు. ధవళేశ్వరంలో క్రాఫ్ట్ ఉడ్ బ్యాంక్ ప్రారంభోత్సవంలో పవన్ కల్యాణ్ వెంట ఆయన సతీమణి అన్నా కొణిదెల కూడా ఉన్నారు. అనారోగ్యం బారినపడినప్పటి నుంచి పవన్‌ కల్యాణ్‌ వెంట ఆయన సతీమణి ఉంటున్నారు. తీవ్ర జ్వరం కారణంగా లోక్‌ భవన్‌లో నిర్వహించే ఎట్ హోమ్ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ దూరమయ్యారు. ఈ విషయాన్ని లోక్‌ భవన్‌ అధికారులకు డిప్యూటీ సీఎం కార్యాలయ