మరోసారి హద్దుదాటిన ఇరాన్..హోర్ముజ్ జలసంధిలో భారత నౌక
Actor ProfilePolitician

మరోసారి హద్దుదాటిన ఇరాన్..హోర్ముజ్ జలసంధిలో భారత నౌక

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
మరోసారి హద్దుదాటిన ఇరాన్..హోర్ముజ్ జలసంధిలో భారత నౌకపై దాడి..ఒకరు గల్లంతు, 10 మంది సురక్షితం
Zee Telugu3 Nov 2026
మరోసారి హద్దుదాటిన ఇరాన్..హోర్ముజ్ జలసంధిలో భారత నౌకపై దాడి..ఒకరు గల్లంతు, 10 మంది సురక్షితం

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు. Indian Vessel Ship Attacked By Iran: అమెరికా - ఇరాన్ ఉద్రిక్తల మధ్య హోర్మూజ్ జలసంధిలో మరోసారి సందిగ్ధత ఏర్పడింది. ఈ క్రమంలో జలసంధిని మూసివేసినట్లు ఇరాన్ ప్రకటించగా.. అలాంటి ఆంక్షలేవి లేవని అమెరికా చెబుతోంది. ఈ గందరగోళం మధ్య ఒమన్ తీరంలోని భారత వాణిజ్య నౌకపై మరోసారి ఇరాన్ సైన్యం దాడికి తెగబడింది. ఈ సంఘటన ఒమన్‌కు తూర్పున సుమారు 17 కిలోమీటర్ల దూరంలో జరిగినట్లు అధికారులు నిర్ధారిస్తున్నారు. ఈ ప్రమాదంలో 10 మంది సిబ్బందిని కాపాడగా.. ఒకరు మరణించినట్లు అధికారులు తెలిపారు. జాతీయ మీడియా వెల్లడించిన వివరాల ప్రకారం.. దెబ్బతిన్న నౌక సిబ్బంది నౌకను విడిచిపెట్టారని, వారిని లైఫ్‌బోట్ ద్వారా రక్షించారని యునైటెడ్ కింగ్‌డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ (UKMTO) ఏజెన్సీ ధృవీకరించింది. నౌక తీవ్రంగా దెబ్బతినడంతో అది తన ప్రయాణాన్ని కొనసాగించలేని స్థితిలో ఉందని, ఒక పౌర సిబ్బంది ఆచూకీ తెలియరాలేదని యూఎస్ సెంట్రల్ కమాండ్ పేర్కొంది. ఈ దాడికి ఇరాన్ దళాలే కారణమని యునైటెడ్ స్టేట్స్ ఆరోపించింది. ఈ సంఘటన క్షిపణి, డ్రోన్ కేంద్రాలు, నౌకాదళ ఆస్తులు, కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌లతో సహా సుమారు 140 ఇరాన్ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని, అమెరికా ప్రతీకార వైమానిక దాడుల పరంపరకు దారితీసింది. ఈ ఉద్రిక్తత ఆ ప్రాంతాన్ని మరింత అస్థిరపరిచి, వాణిజ్య నౌకా మార్గాల భద్రతపై ఆందోళనలను పెంచింది. విదేశీ జోక్యం ఆగిపోయే వరకు ఏ నౌకనూ ఈ జలమార్గం గుండా ప్రయాణించడానికి అనుమతించబోమని పేర్కొంటూ, ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ