మరోసారి భూముల వేలం.. నియోపోలిస్ లో కనీస ధరల పెంపు
Actor ProfilePolitician

మరోసారి భూముల వేలం.. నియోపోలిస్ లో కనీస ధరల పెంపు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
మరోసారి భూముల వేలం.. నియోపోలిస్ లో కనీస ధరల పెంపు, ఎకరం ఎంతంటే
Samayam Telugu2 Dec 2026
మరోసారి భూముల వేలం.. నియోపోలిస్ లో కనీస ధరల పెంపు, ఎకరం ఎంతంటే

హైదరాబాద్ నగర పరిధిలో భూముల విక్రయాల ద్వారా భారీగా ఆదాయం సమీకరించడమే ధ్యేయంగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (HMDA)మరొక భారీ ఈ-వేలానికి శ్రీకారం చుట్టింది. అత్యంత ఖరీదైన కోకాపేట్‌లోని నియోపోలిస్, గోల్డెన్ మైల్ లేఅవుట్లలో ఉన్న విలువైన భూములతో పాటు నగరంలోని పలు ప్రాంతాల్లో ఉన్న ఖాళీ ప్లాట్లను విక్రయించడానికి అధికారులు నోటిఫికేషన్ సిద్ధం చేశారు. గతంలో డిసెంబర్ 2025లో నిర్వహించిన నియోపోలిస్ భూముల వేలంలో ఎకరానికి అత్యధికంగా రూ. 131 కోట్లు, రూ. 118 కోట్ల వరకు ధర పలికి హెచ్‌ఎండీఏకి సుమారు రూ. 1000 కోట్ల ఆదాయం సమకూరింది.అంతకుముందు వివిధ దశల్లో చేపట్టిన వేలం పాటల ద్వారా సుమారు రూ. 3,708 కోట్లు వచ్చాయి. గతంలో నమోదైన రికార్డు ధరలను ప్రాతిపదికగా తీసుకుంటూ.. ప్రస్తుతం నియోపోలిస్ లేఅవుట్‌లోని 4.59 ఎకరాల భూభాగానికి కనీస ధరగా ఎకరానికి రూ. 120 కోట్లుగా నిర్ణయించారు. అలాగే గోల్డెన్ మైల్ లేఅవుట్‌లోని 0.70 ఎకరాల భూమికి ఎకరానికి రూ. 70 కోట్ల ప్రారంభ ధరను నిర్ణయించారు. ఈ ప్రధాన రెండు లేఅవుట్లకు సెప్టెంబర్ 9న ఈ-వేలం జరగనుంది.ఈ వేలం ప్రక్రియ మొత్తం ఆగస్టు 24న ప్రారంభమై సెప్టెంబర్ 9 వరకు కొనసాగనుంది. కోకాపేట్ మాత్రమే కాకుండా నగర శివారులలో ఉన్న పలు రెసిడెన్షియల్ లేఅవుట్లలో కూడా భూములను హెచ్‌ఎండీఏ అమ్మకానికి ఉంచింది. కూకట్‌పల్లి సమీపంలోని హైదరాబాద్ నగర్, మోకిలా, బాచుపల్లి, కొత్తూర్ సమీపంలోని ఇన్ముల్‌నర్వ లేఅవుట్లతో పాటు బైరాగిగూడ, చందానగర్, సూరారం, కాప్రా, కిష్టారెడ్డిపేట్, సరూర్‌నగర్ ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న ప్లాట్లను వేలంలో విక్రయించనున్నారు.ఈ వేలంలో భాగంగా మోకిలా లేఅవుట్‌లోని 300 నుంచి 500 చదరపు గజాల ప్లాట్లకు చదరపు గజానికి కనీస ధర రూ. 55 వేలు, బాచుపల్లి లేఅవుట్‌లోని ప్లాట్లకు రూ. 45 వేలుగా నిర్ణయించారు. అలాగే సూరారంలో ఉన్న 2,420 చదరపు గజాల ల్యాండ్ పార్సెల్‌కు గజానికి రూ. 75