
నటి, పార్లమెంట్ సభ్యురాలు కంగనా రనౌత్ జన్ జీ పై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆమె తాజా వ్యాఖ్యలపై ఆర్.ఎస్.ఎస్. ఛీప్ మోహన్ జీ భగవత్ ప్రభావం ఉన్నట్టుగా అనిపిస్తోంది. ప్రముఖ నటి, బీజేపీ లోక్‌సభ సభ్యురాలు కంగనా రనౌత్ జన్ జీ విషయంలో యూటర్న్ తీసుకున్నారు. మరోసారి ఆమె వారి గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అయితే ఇప్పుడామె జన్ జీ పై ప్రశంసల జల్లు కురిపించారు. ఆ మధ్య జంతర్ మంతర్ లో జరిగిన నిరసనలపై కంగనా రౌనత్ తీవ్ర విమర్శలు చేశారు. అక్కడ చేరిన వారిని ఆమె మురికి కాలువతో పోల్చారు. జన్ జడ్ కు పనీ పాట లేదన్నట్టుగా వ్యాఖ్యానించారు. దాంతో ఆమెపై విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఇప్పుడు తన వ్యాఖ్యలను ఉప సంహరించుకోకుండానే కంగనా ఈ తరం యువతారాన్ని ఈ దేశపు బలమని వ్యాఖ్యానించారు. ఇటీవల ఆమె పీటీఐతో మాట్లాడుతూ, 'జన్ జీ ఈ దేశానికి ఎంతో బలం, అలానే వారి వల్ల ఈ దేశానికి ఎంతో మేలు జరుగుతుంది' అని కితాబిచ్చారు. అలానే ఈ దేశ సంస్కృతి, సంప్రదాయలను అక్కన చేర్చుకుంటున్న యువత ఎక్కువ కావడం కూడా ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంద'ని ఆమె వ్యాఖ్యానించారు. ఇటీవల ఆర్.ఎస్.ఎస్. సర్ సంఘ చాలక్ మోహన్ జీ భగవత్ విద్యార్థులు చేసే నిరసనలు అర్థవంతమైన వని, వారి ఆవేదనను అర్థం చేసుకుని వాటి పరిష్కారం కోసం కృషి చేయాలని చెప్పారు. వారిని జాతి వ్యతిరేకులు అనే విధంగా చిత్రీకరించడం ఎంత మాత్రం సమంజసం కాదని ఆయన తెలిపారు. భావి తరాలకు ప్రతినిధులైన యువతరంతో చర్చలు జరపడం అనేది ఎంతో మంచిదని ఆయన అన్నారు. ఇదే విషయాన్ని కంగనా రనౌత్ ప్రస్తావిస్తూ, 'మోహన్ జీ భగవత్ చెప్పిన విషయాలను అర్థం చేసుకుని, ఆచరించే అవకాశం మాకు కలగడం ఆనందంగా ఉంది. ఆయన అనుభవం, జ్ఞానంతో తెలిపిన అంశాలను తప్పకుండా