మరోసారి ఒరాకిల్ లేఆఫ్ లకు సిద్ధం
Actor ProfilePolitician

మరోసారి ఒరాకిల్ లేఆఫ్ లకు సిద్ధం

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
మరోసారి ఒరాకిల్ లేఆఫ్ లకు సిద్ధం
Eenadu7 Dec 2026
మరోసారి ఒరాకిల్ లేఆఫ్ లకు సిద్ధం

Oracle Layoffs| ఇంటర్నెట్‌డెస్క్‌: కృత్రిమ మేధ విస్తృత వినియోగం కారణంగా మొన్నటి వరకు ఉద్యోగాలు పోగా.. ఆ టెక్నాలజీకి పెట్టిన ఖర్చును పూడ్చుకోవడం కోసం మరికొంత మంది సిబ్బందిని తొలగించుకునేందుకు కంపెనీలు సిద్ధమవుతున్నాయి. ప్రముఖ టెక్ సంస్థ ఒరాకిల్ ఇప్పుడు ఆ బాటలోనే నడుస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ నెలలో మరోసారి భారీసంఖ్యలో లేఆఫ్‌లు ప్రకటించనుందని తెలుస్తోంది. ఏఐ టెక్నాలజీని వేగంగా అందిపుచ్చుకునేందుకు డేటా సెంటర్ల నిర్మాణం, ఏఐ చిప్‌లను కొనుగోలు చేయడం, ఓపెన్‌ ఏఐ వంటి ఏఐ క్లయింట్లకు మద్దతు ఇచ్చేందుకు ఒరాకిల్ భారీగా పెట్టుబడులు పెడుతోంది. ఇప్పుడు ఆ ఖర్చును భర్తీ చేసుకునేలా ఉద్యోగులను తగ్గించుకోవాలని చూస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. అయితే ఆ సంఖ్య ఎంతనేది మాత్రం వెల్లడికాలేదు. సెప్టెంబర్ ఒకటి నుంచి రెండో త్రైమాసికం ప్రారంభం కావడానికి ముందే ఈ కోతలు అమలు చేయాలని భావిస్తోంది. కొన్ని బృందాల్లో కోతలు డబుల్ డిజిట్‌లో ఉండనున్నట్లు సమాచారం. గతంలోనూ ఒరాకిల్ (Oracle) ఉద్యోగుల సంఖ్యను తగ్గించింది. 12 నెలల్లో 21వేల మందిని ఉద్యోగాల నుంచి తొలగించినట్లు జూన్‌ నెలలో రెగ్యులేటరీ ఫైలింగ్‌లో కంపెనీ వెల్లడించింది. సంస్థ కార్యకలాపాల్లో కృత్రిమ మేధను భాగం చేయడంతో ఉద్యోగులను తగ్గించుకోవాల్సి వచ్చిందని, భవిష్యత్తులోనూ ఈ కోతలు కొనసాగుతాయని నాడే పేర్కొంది. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు