మరో భాషలో కూడా స్ట్రీమింగ్ కి వచ్చేసిన సమంత మా ఇంటి బంగారం
Actor ProfileActor

మరో భాషలో కూడా స్ట్రీమింగ్ కి వచ్చేసిన సమంత మా ఇంటి బంగారం

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
మరో భాషలో కూడా స్ట్రీమింగ్ కి వచ్చేసిన సమంత మా ఇంటి బంగారం
123Telugu18 Dec 2026
మరో భాషలో కూడా స్ట్రీమింగ్ కి వచ్చేసిన సమంత మా ఇంటి బంగారం

టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత చాలా కాలం తర్వాత నటించిన అవైటెడ్ చిత్రమే ‘మా ఇంటి బంగారం’. తన గత చిత్రానికి ఎంతో గ్యాప్ ఉన్నప్పటికీ తెలుగు ప్రేక్షకులు సమంతకి మాస్ వెల్కమ్ అందించారు. ఇలా సమంత కంబ్యాక్ ఇచ్చిన ఈ చిత్రం తన కెరీర్ సోలో 100 కోట్ల గ్రాసర్ గా నిలిచి టాలీవుడ్ లో మొదటి 100 కోట్ల గ్రాసర్ గా హీరోయిన్స్ నుంచి నిలిచింది. ఇక థియేటర్స్ నుంచి ఓటిటి లోకి మొదట సౌత్ భాషల్లో స్ట్రీమింగ్ కి వచ్చింది. జియో హాట్ స్టార్ లో అందుబాటులోకి వచ్చిన సినిమా ఇప్పుడు హిందీలో కూడా స్ట్రీమింగ్ కి వచ్చేసింది. అయితే హిందీ వెర్షన్ లో మాత్రం సినిమా మరో ఓటిటిలో అందుబాటులోకి వచ్చింది. ఈ సినిమాని సోని లివ్ వారు సొంతం చేసుకోగా అందులో ఈ చిత్రం నేటి నుంచి అందుబాటులోకి వచ్చింది. ఇక హిందీలో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. ఈ చిత్రానికి నందిని రెడ్డి దర్శకత్వం వహించగా సంతోష్ నారాయణన్ సంగీతం అందించాడు. అలాగే సమంత నిర్మాణం వహించింది