
కొత్తగా ప్రయత్నించడానికి ఫలానాదే సరైన సమయమని ఉంటుందా? కుతూహలం చాలు... కళ్లముందు ఎన్నో కొత్త ఆసక్తులు కనిపిస్తాయి. వాటిలో ప్రయోగాలు చేసుకుంటూ వెళ్లడమే! సరిగ్గా ఇలానే చేస్తున్నారు సుహాసినీ మణిరత్నం. కొత్తగా డిజిటల్ ఆర్ట్‌ని ప్రయత్నిస్తున్నారామె. తన చిత్రాలను తాజాగా ఎగ్జిబిషన్‌లోనూ ఉంచారు. సుహాసిని... నటిగానే కాదు... డైరెక్టర్‌గా, స్క్రీన్‌రైటర్‌గా దక్షిణ భారతదేశంలో చెరగని ముద్ర వేశారు. నిజానికి ఆవిడ ఎంచుకున్నది సినిమాటోగ్రఫీ. అప్పట్లో దాన్ని ఎంచుకున్న తొలి మహిళగానూ నిలిచారు. కొన్నాళ్లు కెమెరా అసిస్టెంట్‌గానూ పనిచేశారామె. ఆపైనే ఇంట్లోవాళ్ల ప్రోత్సాహంతో నటిగా మారారు. దక్షిణాదిన అన్నిభాషల్లోనూ నటించిన సుహాసిని... జాతీయ ఉత్తమ నటి పురస్కారాన్నీ అందుకున్నారు. కొన్ని సినిమాలకు డైలాగ్‌లు రాశారు. డైరెక్టర్‌గానూ మారారు. మల్టీ టాలెంటెడ్ క్రియేటర్‌గా పేరు తెచ్చుకున్నారు. ‘నాకప్పుడు తొమ్మిదేళ్లు ఉంటాయేమో! నాన్న ఒక కెమెరా తెచ్చారు. నది దగ్గరికి వెళ్లి ఫొటోలు తీసుకుందాం రా అన్నారు. గబగబా లోనికి వెళ్లి హాఫ్ వైట్, మెజెంటా రంగుల గౌను వేసుకొచ్చా. చుట్టూ మొక్కలు, నీళ్లు, ఇసుక ఉంటాయి కాబట్టి, నేను మరింత ప్రకాశవంతంగా కనిపించాలి కదా అని ఆ దుస్తులు ఎంచుకున్నా. నాలో కళా కోణం ఉందని తెలుసు. కాకపోతే అది ఎటు దారితీస్తుందో అప్పటికి తెలియదు’ అని గుర్తు చేసుకుంటారామె. సహజంగానే నేర్చుకోవాలనే ఆసక్తి. కొత్తకొత్తవన్నీ ప్రయత్నిస్తుంటారు. కాబట్టే, కాలిగ్రఫీ, పర్‌ఫ్యూమ్ తయారీ అంతెందుకు, 63ఏళ్ల వయసులో భరతనాట్యాన్ని ప్రారంభించారు. 2020లో నిధుల సేకరణలో భాగంగా హీరోయిన్లతో కలిసి 12 రవివర్మ చిత్రాలను రీక్రియేట్ చేసి, క్యాలెండర్‌గా తీసుకొచ్చారు. కుతూహలం ఉంటే ఎప్పుడైనా ఏదైనా చేయొచ్చు, నేర్చుకోవచ్చు అనేది సుహాసిని తత్వం. అందులో భాగంగానే తాజాగా డిజిటల్ ఆర్ట్స్‌పైనా దృష్టిపెట్టారు. ‘చిన్నప్పట్నుంచీ ఫ్యాషన్, స్కెచింగ్, విజువల్ డిటెయిల్స్ అంటే ఇష్టం. సినిమాల్లో ఫ్యాషన్ దుస్తుల్ని చూసి, నా బొమ్మల కోసం ప్రయత్నించేదాన్ని. డిజైనే కాదు, చిన్న చిన్న విషయాల్నీ గమనించేదాన్ని. డిజిటల్ ఆర్ట్స్ దీనికి కొనసాగింపులా తోచింది