
మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Telangana Teachers: పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. అంతర్జాతీయంగా అనుసరిస్తున్న ఉత్తమ బోధనా పద్ధతులను అధ్యయనం చేసేందుకు తన ఉపాధ్యాయులను జపాన్, ఫిన్లాండ్, సింగపూర్, వియత్నాంలకు పంపాలని నిర్ణయించింది. 'ఉపాధ్యాయుల అనుభవ యాత్ర'లో భాగంగా రాష్ట్రం నుంచి 40 మంది ప్రతినిధుల బృందం జపాన్‌కు వెళ్లనుంది. ఈ మేరకు పాఠశాల విద్యా సంచాలకులు నవీన్ నికోలస్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పర్యటన కోసం 29 మంది ప్రధానోపాధ్యాయులు, పాఠశాల సహాయకులు, ఎస్‌జిటిలతో కూడిన తొలి జాబితాను ఖరారు చేశారు. వారితో పాటు 11 మంది అధికారులు కూడా ఉంటారు. వీరు సెప్టెంబర్ 5 నుంచి 12 వరకు జపాన్‌కు ప్రయాణించి, అక్కడి పాఠశాలల నిర్వహణ, బోధనా పద్ధతులను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు. ఎంపికైన ప్రతినిధులకు వీసా ప్రక్రియ, ఇతర నిబంధనలపై వివరించేందుకు ఈ నెల 18వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు వర్చువల్ అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నారు. ఎంపికైన అభ్యర్థులు... తాళ్లూరి సాయి ఈశ్వరి (సూర్యాపేట), గోల్డి బల్బీర్ కౌర్ (పెద్దపల్లి), టి.సునీత (నారాయణపేట), నిమ్మకూరి సంధ్యశ్రీ (సిద్దిపేట), అడపాల వాణి (నల్గొండ), ఎస్.పద్మ (నిర్మల్), వి.గోవర్ధన్ (రంగా రెడ్డి), ఎ.కె.శ్రీనివాస్ (హనమకొండ), కె మల్లయ్య( ములుగు) కోట్ల భాస్కర్ రెడ్డి ( నాగర్ కర్నూల్). పవిత్ర (సూర్యాపేట), ఎం. రజిత (మెదక్), బి. రూప (నారాయణపేట), గూడూరి ఇందిర (కామారెడ్డి), హదియాబేగం (ఆసిఫాబాద్), ఫరీదా తస్నీమ్ (నిర్మల్), జాడి శ్రీనివాస్ (నిర్మల్), అమరవాజు లక్ష్మీనాథం (నిజామాబాద్), సి.కృష్ణా రెడ్డి (వికారాబాద్), కలకమాం శ్రీరెడ్డి (కె.కృష్ణారెడ్డి), పి. (కరీంనగర్), వి.మంజుల (సిద్దిపేట)