మధుమేహం వల్ల వినికిడి శక్తి తగ్గుతుందా
Actor ProfilePolitician

మధుమేహం వల్ల వినికిడి శక్తి తగ్గుతుందా

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
మధుమేహం వల్ల వినికిడి శక్తి తగ్గుతుందా
Sakshi18 Nov 2026
మధుమేహం వల్ల వినికిడి శక్తి తగ్గుతుందా

ప్రపంచం లో అత్యంత వేగంగా పెరుగుతున్న వ్యాధుల్లో మధుమేహం (డయాబెటిస్‌) ఒకటి. ప్రపంచవ్యాప్తంగా 50 కోట్లమందికిపైగా ఈ వ్యాధితో బాధపడుతున్నారని అంచనా. డయాబెటిస్‌తో బాధపడేవారిలో వినికిడి శక్తి కూడా తగ్గుతుందా అనే అంశంపై జరిగిన కొన్ని పరిశోధనల్లో ఆసక్తికరమైన ఫలితాలు వెల్లడయ్యాయి. ఇందులో... డయాబెటిస్‌ లేని వారితో పోలిస్తే ఆ సమస్య ఉన్నవారికి వినికిడి లో΄ాలు వచ్చే అవకాశం రెండు రెట్లకు పైనే ఉన్నట్లు తెలిసింది. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా డయాబెటిస్‌తో బాధపడుతున్న యుక్తవయస్కుల్లో (అడల్ట్స్‌)లో నాలుగోవంతు మంది (అంటే దాదాపు 25% మంది)లో వినికిడి లోపాలు ఉన్నట్లు గుర్తించారు. ‘డయాబెటిస్‌ మెటబాలిజమ్‌ రీసెర్చ్‌ రివ్యూ’ అనే జర్నల్‌లో ప్రచురితమైన అంశాలను బట్టి ప్రపంచవ్యాప్తంగా ఉన్న డయాబెటిస్‌ బాధితుల్లో దాదాపు 13 కోట్ల మందిలో తీవ్రమైన వినికిడి సమస్యలున్నాయని తేలింది. సాధారణంగా డయాబెటిస్‌తో బాధపడే వ్యక్తుల్లో వారికి ఉన్న ఆ సమస్య కళ్లు, మూత్రపిండాలు, నరాలకు ఏదైనా నష్టం చేసిందా అన్నకోణంలో ఎప్పటికప్పుడు పరీక్షలు నిర్వహిస్తుంటారు. ఈ పరిశోధనల నేపథ్యం లో ఇకపైపై పరీక్షల్లాగే వినికిడి పరీక్షలూ చేయాలంటూ పరిశోధకులు వైద్యవర్గాలకు ఓ సూచన చేస్తున్నారు. ‘‘ఈ వినికిడి సమస్యను తేలిగ్గా తీసుకోకూడదు. డయాబెటిస్‌తో వచ్చే వినికిడి లోపం చాలాసార్లు 40–50 ఏళ్ల మధ్య వయసులోనే మొదలువుతుంది. దాంతో సంభాషణలు వినడం, ఎదుటివారితో కమ్యూనికేషన్‌ నెరపడం కష్టమై క్రమంగా ఒంటరితనం పెరుగుతుంది. జ్ఞాపకశక్తి తగ్గడమూ వేగవంతమవుతుంది. అందుకే డయాబెటిస్‌ అన్నది నెమ్మదిగా దెబ్బతీసే పెద్దసమస్య. అందుకే ఇకపై డయాబెటిస్‌ వ్యాధిగ్రస్తులకు చేసే పరీక్షల్లో వినికిడి పరీక్షనూ చేర్చాల్సిన సమయం వచ్చింద’’నేది ఈ అధ్యయనం తాలూకు ప్రధాన పరిశోధకుల మాట. తక్కువ ఖర్చుతో చేసే వినికిడి పరీక్షల ద్వారా సమస్యను మొదటే గుర్తిస్తే సత్వర చికిత్స సాధ్యమని పరిశోధకులు తెలిపారు. అవసరమైనప్పుడు హియరింగ్‌ ఎయిడ్స్‌ ఉపయోగించడం లాంటి సకాలంలో చేసే చికిత్సతో సంభాషణ సామర్థ్యం, జీవననాణ్యత మెరుగుపడే అవకాశం ఉందనీ, అలాగే రక్తంలో చక్కెర మోతాదులను