మది నిండుగా.. ఆదివాసీ పండగ
Actor ProfilePolitician

మది నిండుగా.. ఆదివాసీ పండగ

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
మది నిండుగా.. ఆదివాసీ పండగ
Eenadu23 Nov 2026
మది నిండుగా.. ఆదివాసీ పండగ

మాట్లాడుతున్న కలెక్టర్‌ హరిత, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌ అనిల్, ఎమ్మెల్యే కోవ లక్ష్మి, ఎస్పీ నితికా పంత్, డీఎఫ్‌వో బాలామణి, డీసీసీ అధ్యక్షురాలు సుగుణ, ఎమ్మెల్యే హరీశ్‌బాబు, మాజీ ఎమ్మెల్యే సక్కు, భాజపా నాయకుడు నాగేశ్వర్‌రావు, పుర ఛైర్మన్‌ ఆకాశ్, వైస్‌ ఛైర్మన్‌ అహ్మద్‌ ఆసిఫాబాద్, న్యూస్‌టుడే : జిల్లా కేంద్రంలో ఆదివారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఆదివాసీలు సంబరంగా జరుపుకొన్నారు. వివిధ గ్రామాల నుంచి వచ్చిన తొమ్మిది తెగల ఆదివాసీలతో పట్టణంలో కోలాహలం కనిపించింది. స్థానిక రాయిసెంటర్‌ భవనం వద్ద ఆదివాసీలు సంప్రదాయబద్ధంగా పూజలు చేసి జెండాలు ఆవిష్కరించి అక్కడి నుంచి ర్యాలీ ప్రారంభించారు. కుమురంభీం చౌక్‌ వద్ద అధికారులు, ప్రజాప్రతినిధులు, ఆదివాసీలు ప్రత్యేక పూజలు చేసి విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆదివాసీ భవన్‌లో ఘనంగా వేడుకలు నిర్వహించారు. మొదట కుమురంభీం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఎమ్మెల్యే కోవ లక్ష్మి అధ్యక్షతన జరిగిన సమావేశంలో కలెక్టర్‌ హరిత, ఎస్పీ నితికా పంత్, డీఎఫ్‌వో బాలామణి, ఎమ్మెల్సీ దండె విఠల్, ఎమ్మెల్యే హరీశ్‌బాబు, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌ అనిల్‌కుమార్, పుర ఛైర్మన్‌ ఆకాశ్, వైస్‌ ఛైర్మన్‌ అహ్మద్, పీఏసీఎస్‌ ఛైర్మన్‌ అలీబిన్‌ అహ్మద్, జిల్లా గిరిజనాభివృద్ధి అధికారి అంబాజీ, ఆదివాసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు. కలెక్టర్, ఎస్పీలు ఆదివాసీల వేషధారణలో, సంప్రదాయ చీరకట్టుతో ఆకట్టుకున్నారు. కలెక్టర్‌ హరిత మాట్లాడుతూ.. ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలు విభిన్నమైనవని, భావి తరాలకు అందించాలన్నారు. ఆదివాసీలపై గౌరవంతో సంప్రదాయ వేషధారణలో వచ్చినట్లు చెప్పారు. ఉన్న నిధులతో మారుమూల గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తున్నానని, కెరమెరి మండలం అనార్‌పల్లి, కరంజివాడ వంతెనల నిర్మాణాలకు ప్రభుత్వానికి నివేదించామన్నారు. ఆదివాసీ యువతకు ఉపాధి కల్పించేలా 66 మందికి హైదరాబాద్‌లో మూడు నెలల శిక్షణకు ఆహ్వానించగా 33 మంది ముందుకు వచ్చినట్లు చెప్పారు. ఎస్పీ నితికాపంత్‌ మాట్లాడుతూ.. ఆదివాసీ