మటన్ లో జూనియర్ ఎన్టీఆర్ ఇష్టంగా తినే పార్ట్ ఏదో తెలుసా? 200 ముక్కలు లాగించేస్తాడట
Actor ProfileActor

మటన్ లో జూనియర్ ఎన్టీఆర్ ఇష్టంగా తినే పార్ట్ ఏదో తెలుసా? 200 ముక్కలు లాగించేస్తాడట

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
మటన్ లో జూనియర్ ఎన్టీఆర్ ఇష్టంగా తినే పార్ట్ ఏదో తెలుసా? 200 ముక్కలు లాగించేస్తాడట
Asianet News Telugu31 Oct 2026
మటన్ లో జూనియర్ ఎన్టీఆర్ ఇష్టంగా తినే పార్ట్ ఏదో తెలుసా? 200 ముక్కలు లాగించేస్తాడట

టాలీవుడ్ మాస్ ఆఫ్ మ్యాసెస్, గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ కు సినిమా రంగంలోనే కాకుండా వ్యక్తిగత జీవితంలో కూడా ఎంతో మందితో మంచి అనుబంధాలు ఉన్నాయి . ఆయన నటన, డ్యాన్స్ ఎంత అద్భుతంగా ఉంటాయో.. భోజనం చేయడం పట్ల కూడా ఆయనకు అంతే మక్కువ ఎక్కువ. అయితే ఒకానొక సమయంలో జూనియర్ ఎన్టీఆర్ చాలా లావుగా ఉండేవారు. గతంలో జరిగిన ఈ మాయ పేరేమిటో సినిమా వేడుకలో తారక్ తను అంతగా లావవడానికి గల కారణాన్ని, తనకు ఇష్టమైన మటన్ వంటకం గురించి పంచుకున్న ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఈ ఈవెంట్ లో తారక్ స్వయంగా తనకు నాన్ వెజ్ అంటే ఎంత ఇష్టమో వివరించారు. ముఖ్యంగా మటన్ లో 'మూలిగెలు' లేదా 'నల్లీలు' (Mutton Nalli/Bone Marrow) అంటే తనకు అమితమైన ఇష్టమని . సాధారణంగా ఎవరైనా హోటల్ లేదా ఇంట్లో తిన్నప్పుడు ఒకటి లేదా రెండు నల్లీలు తింటారు. కానీ ఎన్టీఆర్ విషయంలో అది చాలా భిన్నంగా ఉంటుంది. తనకు నల్లీలు ఇష్టమని తెలిస్తే ఒకటి రెండు కాదు.. ఏకంగా 200 నల్లీల వరకు వండేసేవారని, తాను కూడా వాటిని అంతే ఇష్టంగా లాగించేసేవాడినని తారక్ ఆశ్చర్యకరమైన విషయాన్ని బయటపెట్టారు ఈ మాయ పేరేమిటో సినిమా వేడుకలో తారక్ ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నారు. ఈసినిమా హీరో తండ్రి విజయ్ ఫైట్ మాస్టర్. ఆయనతో తారక్ కు చాలా ఏళ్లుగా అనుబంధం ఉంది. ఎన్టీఆర్ సినిమాలకు విజయ్ ఫైట్ మాస్టర్ గా ఉన్నారు. ఆయన, ఆయన భార్య పెట్టే ఫుడ్ వల్లే తాను బాగా లావయ్యానని ఎన్టీఆర్ అన్నారు. తనకు మటన్ నల్లి ఇష్టమని తెలిసి.. విజయ్ భార్య ఎంతో ప్రేమతో భారీ సంఖ్యలో వాటిని వండి.. షూటింగ్ లొకేషన్స్ కు పంపించేదట. . తాను ఎన్నో సార్లు అడగడం.. ఆవిడ ఎంతో ఓపికగా వండి పంపించడం