మీ స్నేహాన్ని ఎప్పటికీ మరువలేం.. భారత్ కు ఇరాన్ కృతజ్ఞతలు
Actor ProfilePolitician

మీ స్నేహాన్ని ఎప్పటికీ మరువలేం.. భారత్ కు ఇరాన్ కృతజ్ఞతలు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
మీ స్నేహాన్ని ఎప్పటికీ మరువలేం.. భారత్ కు ఇరాన్ కృతజ్ఞతలు
Eenadu27 Sept 2026
మీ స్నేహాన్ని ఎప్పటికీ మరువలేం.. భారత్ కు ఇరాన్ కృతజ్ఞతలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: తమ మాజీ సుప్రీం ఖమేనీ అంత్యక్రియల (Khamenei Funeral)కు హాజరైన భారత ప్రతినిధుల (Indian delegation)కు దిల్లీలోని ఇరాన్‌ రాయబార కార్యాలయం (Iran Embassy) కృతజ్ఞతలు తెలిపింది. ఈ దుఃఖ సమయంలో ఇరాన్ ప్రజలకు అండగా నిలిచి..తమ సానుభూతిని భారత్‌ను మరిచిపోలేమని తెలపింది. ఈ చర్య ఇరుదేశాల మధ్య స్నేహం, అనుబంధానికి ప్రతీక అని.. చారిత్రక, సాంస్కృతిక సంబంధాలను ప్రతిబింబిస్తుందని పేర్కొంది. ఇరుదేశాల మధ్య ఉన్న ఈ చిరకాల బంధాన్ని, స్నేహాన్ని ఇరాన్ ప్రజలు ఎప్పటికీ గుర్తపెట్టుకుంటారని పేర్కొంది. ఇరాన్‌ దివంగత సుప్రీం నేత ఖమేనీ అంత్యక్రియల కార్యక్రమాలు (Khamenei Funeral) శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఆయన భౌతికకాయాన్ని రాజధాని టెహ్రాన్‌లోని గ్రాండ్‌ మొసల్లా మసీదులో ఉంచారు. దేశ విదేశీ ప్రతినిధులు, అధికారులు ఆయన భౌతిక కాయానికి శ్రద్ధాంజలి ఘటించారు. భారత్‌ తరఫున బిహార్‌ గవర్నర్, సయ్యద్‌ అతా హస్నైన్, విదేశాంగ శాఖ సహాయ మంత్రి పబిత్రా మార్గరీటా నివాళులర్పించారు. కాంగ్రెస్‌ నేత సల్మాన్ ఖుర్షీద్, జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీతో పాటు భారత్‌కు చెందిన సిక్కు, హిందూ, ముస్లిం, క్రైస్తవ మత పెద్దలు అంత్యక్రియలకు హాజరయ్యారు. ఖమేనీ పార్థివ దేహాన్ని ఆయన సొంత పట్టణం మషహద్‌లో ఈనెల 9న ఖననం చేయనున్నారు. ఇదీ చదవండి: ఖమేనీ అంత్యక్రియల్లో ముగ్గురు కుమారులు గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు