మీ స్నేహాన్ని ఎప్పటికీ మరిచిపోం’ భారత్ కు కృతజ్ఞతలు తెలుపుతూ ఇరాన్ లేఖ
Actor ProfilePolitician

మీ స్నేహాన్ని ఎప్పటికీ మరిచిపోం’ భారత్ కు కృతజ్ఞతలు తెలుపుతూ ఇరాన్ లేఖ

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
మీ స్నేహాన్ని ఎప్పటికీ మరిచిపోం’ భారత్ కు కృతజ్ఞతలు తెలుపుతూ ఇరాన్ లేఖ
Samayam Telugu27 Sept 2026
మీ స్నేహాన్ని ఎప్పటికీ మరిచిపోం’ భారత్ కు కృతజ్ఞతలు తెలుపుతూ ఇరాన్ లేఖ

తమ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల్లో పాల్గొన్నందుకు భారత్‌కు ఇరాన్ ధన్యవాదాలు తెలిపింది. భారత్‌ను అభినందిస్తూ లేఖ రాసిన ఇరాన్. ఇది ఇరు దేశాల మధ్య ఉన్న ‘పరస్పర గౌరవానికి శక్తివంతమైన నిదర్శనం’ అని పేర్కొంది. ఇది భారత్-ఇరాన్ మధ్య గల చారిత్రక, సాంస్కృతిక బంధాలను ప్రతిబింబిస్తోందని ఈ మేరకు న్యూఢిల్లీలోని ఇరాన్ రాయబార కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది. ఫిబ్రవరి 28 అమెరికా- ఇజ్రాయెల్ సంయుక్త దాడిలో మరణించిన ఖమేనీ అంత్యక్రియల కోసం బిహార్ గవర్నర్ సయ్యద్ అతా హస్నైన్, కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి పబిత్ర మార్గెరిటాలతో కూడిన ఉన్నత స్థాయి భారత బృందం శుక్రవారం ఇరాన్ చేరుకుంది.వీరితో పాటు కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్, జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీపుల్స్ డెమొక్రాటిక్ పార్టీ అధినేత్రి మొహబూబా ముఫ్తీతో పాటు పలువురు సిక్కు, ముస్లిం, సిక్కు, క్రైస్తవ మత పెద్దలు భారత్ నుంచి హాజరై.. ఖమేనీకి నివాళులర్పించారు. ఎక్స్ (ట్విట్టర్)‌లో సుదీర్ఘ పోస్ట్ పెట్టిన భారత్‌లో ఇరాన్ రాయబార కార్యాలయం.. ఖమేనీ అంత్యక్రియల్లో పాల్గొన్నందుకు భారతీయ సమాజానికి ధన్యవాదాలు తెలిపింది. ‘‘స్నేహం, కరుణ, హృదయపూర్వక గౌరవాన్ని ఇస్లామిక్ రిపబ్లిక్ ఎన్నటికీ మరచిపోదు’’ అని పేర్కొంది. ‘‘భారత్‌లోని ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ అమరవీరుడైన తమ సుప్రీం లీడర్, హిస్ ఎమినెన్స్ అయతుల్లా సయ్యద్ అలీ ఖమేనీ అంత్యక్రియల పాల్గొని నివాళులర్పించినందుకు స్నేహపూర్వక భారతదేశ ప్రభుత్వానికి, ప్రజలకు, ముఖ్యంగా భారత ప్రభుత్వం తరపున హాజరైన అధికారిక ప్రతినిధి బృందానికి, హృదయపూర్వక కృతజ్ఞతలు,అభినందనలు తెలియజేస్తోంది’’ అని ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు.ఈ పవిత్రమై కార్యక్రమాలకు భారత రాజకీయ నాయకులు, పార్లమెంట్ సభ్యులు, ప్రముఖ పండితులు, మేధావులు, విభిన్న విశ్వాసాలు, మత వర్గాల నాయకులు హాజరు కావడం ఇరు దేశాల మధ్య ఉన్న 'లోతైన చారిత్రక, సాంస్కృతిక, మానవ బంధాలను' ప్రతిబింబించిందని అది పేర్కొంది.‘‘ఈ విషాద సమయంలో ఇరాన్ ప్రజలకు హృదయపూర్వక