మిస్టీరియస్ క్రైమ్ థ్రిల్లర్ ది రెడ్ బ్యాగ్’ రిలీజ్ డేట్ లాక్.. ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ ద్వారా
Actor ProfileActor

మిస్టీరియస్ క్రైమ్ థ్రిల్లర్ ది రెడ్ బ్యాగ్’ రిలీజ్ డేట్ లాక్.. ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ ద్వారా

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
మిస్టీరియస్ క్రైమ్ థ్రిల్లర్ ది రెడ్ బ్యాగ్’ రిలీజ్ డేట్ లాక్.. ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ ద్వారా
123Telugu1 Jan 2027
మిస్టీరియస్ క్రైమ్ థ్రిల్లర్ ది రెడ్ బ్యాగ్’ రిలీజ్ డేట్ లాక్.. ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ ద్వారా

టాలీవుడ్ నుంచి ప్రస్తుతం పలు థ్రిల్లర్ సినిమాల ట్రెండ్ అలా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మరి వాటిలో మరో డిఫరెంట్ మిస్టీరియస్ థ్రిల్లర్ గా రాబోతున్న అవైటెడ్ చిత్రమే ‘ది రెడ్ బ్యాగ్’. యువ నటీనటులు కబీర్ సింగ్, ప్రసాద్ బెహరా, రాధ్య, మోనిక, స్నేహా సింగ్, ఆకాంక్ష, ఈషాన్ శంకర్, అవినాష్ బాదల్, భార్గవి, రాశీ తదితరులు నటించిన ఈ చిత్రాన్ని రవి కుమార్ సిరపు దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమా ఆల్రెడీ ప్రమోషనల్ కంటెంట్ తో సాలిడ్ బజ్ ని ఈ సినిమా రేకెత్తించింది. ఇక ఫైనల్ గా ఈ సినిమా రిలీజ్ డేట్ లాక్ అయ్యింది. ఈ చిత్రాన్ని మేకర్స్ ఈ ఆగష్టు 21న విడుదల చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. ఇక ఈ చిత్రాన్ని ప్రముఖ థియేట్రికల్ మల్టిప్లెక్స్ చైన్ సంస్థ పీవీఆర్ సినిమాస్ వారు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇది సినిమాపై ఉన్న కంటెంట్ పై వారికున్న నమ్మకం అని చెప్పవచ్చు. ఇక ఈ చిత్రం రిలీజ్ డేట్ పోస్టర్ కూడా మంచి స్టైలిష్ అండ్ స్ట్రైకింగ్ గా కనిపిస్తుంది. ఈ చిత్రానికి ప్రియేష్ గురుస్వామి సినిమాటోగ్రఫీ అందించగా, శేఖర్ మోపురి సంగీతం సమకూరుస్తున్నారు. శివ శర్వాణి ఎడిటర్‌ గా వర్క్ చేస్తున్నారు. అలాగే హరికృష్ణ సోమిశెట్టి నిర్మాణం వహించారు