మూవీలో జానకమ్మ.. వైరల్ అవుతున్న డిలీటెడ్ సీన్
Actor ProfileActor

మూవీలో జానకమ్మ.. వైరల్ అవుతున్న డిలీటెడ్ సీన్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
మూవీలో జానకమ్మ.. వైరల్ అవుతున్న డిలీటెడ్ సీన్
Eenadu2 Nov 2026
మూవీలో జానకమ్మ.. వైరల్ అవుతున్న డిలీటెడ్ సీన్

ఇంటర్నెట్‌ డెస్క్‌: తమిళంలో క్లాసిక్ లవ్ స్టోరీగా నిలిచిన చిత్రం ‘96’ (96 Movie). విజయ్ సేతుపతి (Vijay Sethupathi), త్రిష (Trisha) ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి ప్రేమ్‌కుమార్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో గాయని ఎస్. జానకి (S. Janaki) ఒక ప్రత్యేక పాత్రలో నటించారు. అయితే, థియేటర్లలో విడుదలయ్యే ముందు నిడివి కారణంగా సినిమాలో ఆ సన్నివేశాన్ని తొలగించారు. ఆ తర్వాత చిత్రబృందం ఈ డిలీటెడ్ సీన్‌ను అధికారికంగా విడుదల చేసింది. మైసూరులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ జానకి నిన్న రాత్రి తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. జానకమ్మ మృతి పట్ల నటి త్రిష సంతాపం తెలిపారు. తన కెరీర్‌లోని ఒక ప్రత్యేకమైన సినిమాలో జానకమ్మ పేరు పెట్టుకోవడం తనకు దక్కిన గొప్ప గౌరవమన్నారు. ‘‘మిమ్మల్ని కలవడం, మీ ప్రేమను పొందడం నా అదృష్టం. మీ ఆప్యాయత, చిరునవ్వు ఎప్పటికీ మరువలేను. గొప్ప కళాకారులు సాధారణంగా ఉంటారని మీరు నిరూపించారు. మీ మధురమైన గొంతు ఎప్పటికీ సజీవంగానే ఉంటుంది. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నా జానకమ్మ. మీ ఆత్మకు శాంతి చేకూరాలి’’ అంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. సమంత (Samantha) ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘మా ఇంటి బంగారం’