మీ మొబైల్ లో తప్పక ఉండాల్సిన ప్రభుత్వ యాప్స్ ఇవీ.. వీటితో పనులన్నీ ఈజీ
Actor ProfilePolitician

మీ మొబైల్ లో తప్పక ఉండాల్సిన ప్రభుత్వ యాప్స్ ఇవీ.. వీటితో పనులన్నీ ఈజీ

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
మీ మొబైల్ లో తప్పక ఉండాల్సిన ప్రభుత్వ యాప్స్ ఇవీ.. వీటితో పనులన్నీ ఈజీ
Asianet News Telugu25 Sept 2026
మీ మొబైల్ లో తప్పక ఉండాల్సిన ప్రభుత్వ యాప్స్ ఇవీ.. వీటితో పనులన్నీ ఈజీ

భారతదేశం డిజిటల్ వైపు వేగంగా దూసుకుపోతోంది. మనకు కావాల్సిన సేవలను వేలిముద్రతో పొందేలా కేంద్ర ప్రభుత్వం ఎన్నో మొబైల్ యాప్స్‌ను అందుబాటులోకి తెచ్చింది. స్మార్ట్‌ఫోన్ వాడుతున్న ప్రతి ఒక్కరి మొబైల్‌లో కచ్చితంగా ఉండాల్సిన 8 ముఖ్యమైన ప్రభుత్వ యాప్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సర్టిఫికెట్లు, డాక్యుమెంట్ల హార్డ్ కాపీలను వెంట పట్టుకెళ్లే రోజులు పోయాయి. డిజీ లాకర్ (DigiLocker) యాప్ ఉంటే మీ ఒరిజినల్ డాక్యుమెంట్లు అన్నీ మీ మొబైల్‌లోనే భద్రంగా ఉంటాయి. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, టెన్త్ క్లాస్ మార్క్స్ మెమో వంటి కీలక పత్రాలను ఇందులో డిజిటల్ రూపంలో సేవ్ చేసుకోవచ్చు. చట్టపరంగా ఈ డిజిటల్ కాపీలకు పూర్తి గుర్తింపు ఉంటుంది. ట్రాఫిక్ పోలీసులు అడిగినా లేదా ఎక్కడైనా ఐడీ ప్రూఫ్ చూపించాలన్నా ఇది వంద శాతం వాలిడ్ అవుతుంది. ఉమంగ్ (UMANG) యాప్ అనేది ఒక రకమైన ఆల్ ఇన్ వన్ సూపర్ యాప్. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వందలాది సేవలు ఈ ఒక్క యాప్ ద్వారానే యాక్సెస్ చేయవచ్చు. ఈపీఎఫ్ఓ (EPFO) బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం, పాన్‌కార్డ్ కోసం అప్లై చేయడం, గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవడం, పెన్షన్ సేవలు పొందడం లాంటివి ఇందులో ఈజీగా అయిపోతాయి. వేర్వేరు పనుల కోసం రకరకాల యాప్స్ డౌన్‌లోడ్ చేసుకోకుండా ఈ ఒక్క యాప్ ఉంటే చాలు. వాహన దారులు, డ్రైవర్లకు ఎం పరివాహన్ (mParivahan) యాప్ ఒక వరం లాంటిది. మీ వాహనానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, ఇన్సూరెన్స్ కాపీ, పొల్యూషన్ సర్టిఫికెట్, డ్రైవింగ్ లైసెన్స్ వంటి వివరాలన్నీ ఇందులో డిజిటల్ ఫార్మాట్‌లో స్టోర్ అవుతాయి. రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ దీనిని అధికారికంగా అప్రూవ్ చేసింది. అంతేకాదు, మీ కారు లేదా బైక్‌పై ఏవైనా ట్రాఫిక్ ఫైన్లు ఉన్నాయా లేదా అనేది కూడా ఈ యాప్‌లో చాలా సులువుగా చెక్ చేసుకోవచ్చు. మన