
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇరాన్ శక్తిని చూసి ఎంతగా భయపడుతున్నారో తెలియజేసే ఓ ఆసక్తికర ఘటన వెలుగులోకి వచ్చింది. తుర్కియే పర్యటన సందర్భంగా ప్రాణభయంతో ఆయన రహస్యంగా విమానం మారాల్సి వచ్చింది. ఈ ఘటనను ఇరాన్ మీడియా తనకు అనుకూలంగా మలుచుకుని, ఇది ట్రంప్‌కు జరిగిన 'అవమానం' అంటూ తీవ్రంగా ఎద్దేవా చేస్తోంది. అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధ వాతావరణం కొనసాగుతున్న వేళ ఈ పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది.అసలేం ఏం జరిగింది?గత నెల 8న టర్కీలోని అంకారాలో జరిగిన నాటో సదస్సుకు హాజరైన ట్రంప్, తిరుగు ప్రయాణంలో ఈ రహస్య ఆపరేషన్ చేపట్టారు. ఆయన ప్రయాణిస్తున్న అధ్యక్షుడి అధికారిక విమానం 'ఎయిర్ ఫోర్స్ వన్' లక్ష్యంగా షోల్డర్-ఫైర్డ్ క్షిపణితో దాడి జరిగే అవకాశం ఉందని అమెరికా సీక్రెట్ సర్వీస్‌కు కచ్చితమైన సమాచారం అందింది. దీనికి తోడు ట్రంప్ అంకారాలో బస చేసిన హోటల్‌లోని ఏ అంతస్తులో ఉన్నారనే కచ్చితమైన సమాచారం కూడా ఇరాన్‌కు చేరినట్లు అమెరికా అధికారులు గుర్తించి దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ హెచ్చరికను అత్యంత తీవ్రంగా పరిగణించిన సీక్రెట్ సర్వీస్, వెంటనే ఓ అసాధారణ ఆపరేషన్ చేపట్టింది.ట్రంప్‌ను, ఆయన కొద్దిమంది సహాయకులను ఓ క్యాటరింగ్ ఫుడ్ ట్రక్కులో ఎక్కించి, ఎయిర్ ఫోర్స్ వన్ నుంచి దూరంగా తీసుకెళ్లారు. అనంతరం ఎలాంటి ప్రత్యేక గుర్తింపు లేని చిన్నపాటి C-32A ప్రభుత్వ జెట్‌లోకి మార్చి తుర్కియే నుంచి తరలించారు. మరోవైపు, వైట్ హౌస్ అధికారులు, మీడియా ప్రతినిధులతో కూడిన అసలైన ఎయిర్ ఫోర్స్ వన్ విమానం యథావిధిగా