
ముంబైలో కుడి భుజానికి శస్త్ర చికిత్స చేయించుకున్న ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరామర్శించారు. ముంబైలో కుడి భుజానికి శస్త్ర చికిత్స చేయించుకున్న ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (AP Deputy CM Pawan Kalyan)ను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) పరామర్శించారు. కొద్దిసేపటి క్రితం సీఎం చంద్రబాబు నాయుడు ఆసుపత్రికి చేరుకుని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని వాకబు చేశారు. సీఎం చంద్రబాబు పరామర్శకు సంబంధించిన ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్ ఆపరేషన్ బెడ్ పక్కన కూర్చుని ఉండగా, చంద్రబాబు ఆయనకు ఎదురుగా కూర్చుని ఉన్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఆరోగ్యంగా ఉన్నట్లుగా ఈ ఫొటో తెలియజేస్తోంది. పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలంటూ ఆయన అభిమానులు, జనసైనికులు ఎక్స్ వేదికగా కోరుకుంటున్నారు. శనివారం పవన్ కళ్యాణ్‌కు ముంబైలో నిర్వహించిన శస్త్ర చికిత్స విజయవంతం అయినట్లుగా జనసేన వర్గాలు వెల్లడించాయి. ప్రపంచ ప్రఖ్యాత ఆర్థోపెడిక్ సర్జన్, స్పోర్ట్స్ మెడిసిన్ నిపుణుడు డా.దిన్షా పార్థీవాలా నేతృత్వంలోని వైద్యుల బృందం పవన్ కళ్యాణ్ కుడి భుజానికి సర్జరీ నిర్వహించారు. రొటేటర్ కఫ్ ఇంజ్యూరీతోపాటు, భుజానికి అవల్షన్ ఫ్రాక్చర్ ఉండటంతో భారీ సర్జరీ చేయాల్సి వచ్చింది. ఈ సర్జరీకి మూడున్నర గంటల సమయం పట్టిందని జనసేన వర్గాలు అధికారిక ప్రకటనను విడుదల చేశాయి. పవన్ కళ్యాణ్‌కు 2016లో భుజానికి గాయాలు అయ్యాయి. ప్రథమ చికిత్స అనంతరం వైద్యులు తగిన విశ్రాంతి అవసరం అని సూచించినా సమావేశాలలో పాల్గొన్నారు. 2018లో చేపట్టిన పోరాట యాత్ర సందర్భంలో జనసేన పార్టీ శ్రేణులు తమ అభిమాన నాయకుడికి దగ్గరగా వెళ్ళి చేతులు కలపాలి అనే ఉద్దేశంతో చేతులు పట్టి లాగడంతో.. నొప్పి కలిగినా ఆయన భరించేవారు. ఇలా పదే పదే జరుగుతుండటంతో ఆయనకు గాయాలు తిరగబెట్టాయి