ముంబై వరదల లాక్ డౌన్..ప్రజలు బయటకు రావొద్దని హెచ్చరిక..16 రైళ్లు
Actor ProfilePolitician

ముంబై వరదల లాక్ డౌన్..ప్రజలు బయటకు రావొద్దని హెచ్చరిక..16 రైళ్లు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ముంబై వరదల లాక్ డౌన్..ప్రజలు బయటకు రావొద్దని హెచ్చరిక..16 రైళ్లు, విమానాలు రద్దు
Zee Telugu27 Sept 2026
ముంబై వరదల లాక్ డౌన్..ప్రజలు బయటకు రావొద్దని హెచ్చరిక..16 రైళ్లు, విమానాలు రద్దు

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు. Mumbai Rain Alert News: ముంబైపై వరుణ దేవుడు పగపట్టినట్లు అయ్యింది. నగరవ్యాప్తంగా గత కొన్నిరోజులుగా కురిస వర్షాలు ఇప్పుడు వరదలుగా మారి పొంగి పొర్లుతున్నాయి. ఈ కుండపోత వర్షాల వల్ల ముంబై మహానగరంతో పాటు మహారాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింపోయింది. రోడ్లు జలమయమవడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాని పరిస్థితి ఏర్పడింది. మరోవైపు వరద నీరు రైల్వే ట్రాక్‌లను ముంచెత్తాయి. ఇప్పటికే సాధారణ రైళ్లు రద్దు కాగా.. ఇప్పుడు లోకల్ రైళ్ల సర్వీసులకు పూర్తి అంతరాయం ఏర్పడింది. అలాగే ముంబై-పుణె మార్గంలో ట్రాఫిక్ నిలిచిపోవడం సహా వాతావరణ శాఖ భారీ వర్షాల నడుమ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచించింది. అటు రైళ్లు, రోడ్డు మార్గాల్లో రవాణాకు అంతరాయం ఏర్పడడం సహా ఇటు విమాన సర్వీసులు కూడా రద్దు చేయడంతో పాటు కొన్ని విమానాలను దారి మళ్లించారు. మహారాష్ట్రలో ఎడతెరిపి లేని వర్షాల కారణంగా ముంబై-పుణె రైలు మార్గం మూతపడింది. కర్జత్-లోనావాలా భోర్ ఘాట్ సెక్షన్‌లోని రెండు చోట్ల కొండచరియలు విరిగిపడటంతో ఈ మార్గాన్ని తాత్కాలికంగా మూసివేశారు. అంతేకాకుండా, ముంబైకి రానుపోను వెళ్లే 20కి పైగా రైళ్లను రద్దు చేశారు. ముంబైకి జీవనాధారంగా భావించే లోకల్ రైళ్లు నిలిచిపోయాయి. ముంబైలో భారీ వర్షాల నేపథ్యంలో రైల్వే శాఖ పలు రైళ్ల రాకపోకలను నిలిపేసింది. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకొని.. ముంబై వెళ్లే పలు రైళ్లను రద్దు చేస్తూ ప్రకటన విడుదల