
ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తన సరికొత్త చిత్రం 'ది ఒడిస్సీ' ప్రమోషన్స్ కోసం ఇండియాలో అడుగుపెట్టారు. నిన్న ముంబైలో జరిగిన ఈ సినిమా స్పెషల్ ప్రీమియర్‌కు ఆయనతో పాటు నటులు మ్యాట్ డామన్, టామ్ హాలండ్ హాజరయ్యారు. అయితే, ఈ గ్రాండ్ ఈవెంట్‌కు ముందు వీరు ముగ్గురూ ముంబైలోని ఒక కేఫ్‌లో ఆగి, సరదాగా చాయ్ తాగుతూ కనిపించడం ఆసక్తికరంగా మారింది.ఈ పర్యటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోను యూనివర్సల్ పిక్చర్స్ ఇండియా తమ సోషల్ మీడియాలో పంచుకుంది. "ది ఒడిస్సీ ముంబై ప్రీమియర్‌కు ముందు చిన్న టీ స్టాప్. పెద్ద రాత్రి ఎదురుచూస్తోంది. కానీ, చాయ్ మొదట!" అనే క్యాప్షన్‌తో ఈ ఫొటోలను పోస్ట్ చేసింది. ఇందులో నోలన్, డామన్, హాలండ్ చాయ్‌తో పాటు బన్ మస్కా, కొన్ని డెజర్ట్‌లను ఆస్వాదిస్తున్నట్లు కనిపించారు.హోమర్ రచించిన ఇతిహాసం ఆధారంగా 'ది ఒడిస్సీ' చిత్రాన్ని నోలన్ తెరకెక్కించారు. ఆయన భార్య ఎమ్మా థామస్ ఈ చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమాలో యాన్ హథవే, రాబర్ట్ ప్యాటిన్సన్, జెండయా, చార్లీజ్ థెరాన్ వంటి భారీ తారాగణం నటించింది. గతేడాది ఆస్కార్ అవార్డులు గెలుచుకున్న 'ఓపెన్‌హైమర్' తర్వాత నోలన్ నుంచి వస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలున్నాయి.పూర్తిగా ఐమ్యాక్స్ కెమెరాలతో చిత్రీకరించిన తొలి చిత్రంగా రికార్డ్ సాంకేతికంగా కూడా ఈ చిత్రం ఎంతో ప్రత్యేకమైనది. పూర్తిగా ఐమ్యాక్స్ కెమెరాలతో చిత్రీకరించిన తొలి ఫీచర్ ఫిల్మ్‌గా ఇది రికార్డు సృష్టించనుంది. ఈ సినిమా 70ఎంఎం స్క్రీనింగ్ టికెట్లను ఏడాది