
బాలీవుడ్ స్టార్ హీరో సన్నీ డియోల్ నటించిన లేటెస్ట్ పీరియడ్ డ్రామా ‘బట్వారా 1947’. ఈ సినిమా ఆగస్టు 14న థియేటర్లలోకి వస్తోంది. ఈ నేపథ్యంలో లక్నోలో జరిగిన ప్రమోషన్స్ కార్యక్రమంలో సన్నీ డియోల్, ప్రీతి జింటా, కరణ్ డియోల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన సన్నీ డియోల్, నేటి తరం యువత అంతా ఈ సినిమాను తప్పకుండా చూడాలని కోరారు. దేశ విభజన సమయంలో ప్రజలు పడిన బాధలు, వారి త్యాగాలు అర్థం కావాలంటే ఈ చిత్రం చూడటం చాలా అవసరం అని అన్నారు. లోకంలో మానవత్వం కంటే ఏదీ గొప్పది కాదని ఈ సినిమా నిరూపిస్తుందని చెప్పారు. ఆస్ఘర్ వజాహత్ రాసిన ప్రసిద్ధ నాటకం ‘జిస్ లాహోర్ నై వేఖ్యా ఓ జమ్మెయ్ నై’ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ పతాకంపై నేషనల్ అవార్డు విన్నర్ రాజ్‌కుమార్ సంతోషి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో షబానా అజ్మీ, అలీ ఫజల్, అభిమన్యు సింగ్ కీలక పాత్రలు పోషించారు. ఇండియా-పాకిస్తాన్ విభజన నేపథ్యం అనగానే అందరికీ సన్నీ డియోల్ 2001 బ్లాక్‌బస్టర్ ‘గదర్: ఏ ప్రేమ్ కథ’ గుర్తుకొస్తుంది. అయితే, ఈ విషయమై సన్నీ స్పష్టత ఇచ్చారు. “గదర్ అనేది దేశ విభజన కాలంలో సాగే ఒక అందమైన ప్రేమకథ. తారా సింగ్ సరదాగా ఉండే వ్యక్తి. పాటలు పాడుతూ, ప్రేమించి పెళ్లి చేసుకున్న రొమాంటిక్ సర్దార్. కానీ ‘బట్వారా 1947’ కథ పూర్తిగా వేరు. ఇది ఒక కుటుంబం చుట్టూ తిరిగే ఎమోషనల్ కథ. ఇందులో కథానాయకుడు తన కుటుంబంతో పాటు ఒక వృద్ధురాలిని కాపాడటానికి పోరాడతాడు” అని సన్నీ వివరించారు. ట్రైలర్ నచ్చిన ప్రతి ఒక్కరికీ సినిమా కచ్చితంగా నచ్చుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గతంలో తమ కాంబినేషన్‌లో వచ్చిన ‘ఘాయల్’, ‘దామిని’, ‘ఘాతక్’ చిత్రాల విజయం వల్లే, 30 ఏళ్ల