మున్సిపాలిటీలో స్వాతంత్య్ర వేడుకలు జెండా ఎగురవేసిన చైర్ పర్సన్
Actor ProfilePolitician

మున్సిపాలిటీలో స్వాతంత్య్ర వేడుకలు జెండా ఎగురవేసిన చైర్ పర్సన్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
మున్సిపాలిటీలో స్వాతంత్య్ర వేడుకలు జెండా ఎగురవేసిన చైర్ పర్సన్
HMTV25 Dec 2026
మున్సిపాలిటీలో స్వాతంత్య్ర వేడుకలు జెండా ఎగురవేసిన చైర్ పర్సన్

Chevella: మున్సిపాలిటీలో స్వాతంత్య్ర వేడుకలు జెండా ఎగురవేసిన చైర్‌పర్సన్! Chevella: చేవెళ్ల మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు చేవెళ్ల మున్సిపల్ కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను మున్సిపల్ చైర్మన్ దేవర సమత వెంకట్ రెడ్డి ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించి, దేశభక్తి, స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ. మున్సిపల్ చైర్ పర్సన్ దేవర సమత వెంకట్ రెడ్డి మాట్లాడుతూ..మన దేశానికి స్వాతంత్ర్యం ఎంతోమంది మహనీయుల త్యాగాలు, పోరాటాల ఫలితం. వారి త్యాగాలను మనం ఎప్పటికీ మరువకూడదు. యువత దేశానికి వెన్నెముక. విద్యతో పాటు క్రమశిక్షణ, దేశభక్తి, సేవా భావాన్ని అలవర్చుకొని సమాజ అభివృద్ధిలో భాగస్వాములు రావాలని చేవెళ్ల పట్టణ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని, మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతూ, పర్యావరణాన్ని కాపాడుతూ, ప్రజా సమస్యల పరిష్కారానికి కలిసికట్టుగా ముందుకు సాగాలని యువత మంచి లక్ష్యాలను ఏర్పరచుకొని, నూతన ఆలోచనలతో దేశ ప్రగతికి బాటలు వేయాలి,స్వాతంత్ర్య సమరయోధులు కలలుగన్న బలమైన, అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించేందుకు మనందరం ఐక్యంగా కృషి చేద్దాం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, కో ఆప్షన్ మెంబర్స్, మాజీ సర్పంచులు, ఉప సర్పంచులు, నాయకులు,వార్డు సభ్యులు, మున్సిపల్ సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు