మొదట నో చెప్పిన హీరో.. తర్వాత ఆ స్టార్ హీరోయిన్ కు ఫిదా
Actor ProfileActor

మొదట నో చెప్పిన హీరో.. తర్వాత ఆ స్టార్ హీరోయిన్ కు ఫిదా

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
మొదట నో చెప్పిన హీరో.. తర్వాత ఆ స్టార్ హీరోయిన్ కు ఫిదా
Zee Telugu25 Sept 2026
మొదట నో చెప్పిన హీరో.. తర్వాత ఆ స్టార్ హీరోయిన్ కు ఫిదా

Star Heroine:ఒకప్పుడు ఫోటోషూట్‌కే తిరస్కరణ ఎదుర్కొన్న స్టార్ హీరోయిన్ కి, తర్వాత అదే అవకాశం ఆమెను బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా నిలబెట్టింది. సంజయ్ ఖాన్, జరీన్ ఖాన్‌కు సంబంధించిన ఈ ఆసక్తికర సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బాలీవుడ్‌లో అందం, అభినయం, గ్లామర్‌కు ప్రతీకగా నిలిచిన రేఖ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దశాబ్దాలుగా ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తున్న ఆమె ప్రయాణం మాత్రం సులభం కాదు. స్టార్‌డమ్‌కు ముందుగా ఎన్నో తిరస్కారాలు, అవమానాలు ఎదుర్కొన్న రేఖ జీవితంలో జరిగిన ఓ ఆసక్తికర సంఘటన ఇప్పుడు మరోసారి వైరల్ అవుతోంది. చిన్న వయసులోనే కుటుంబ పరిస్థితుల వల్ల సినిమాల్లోకి వచ్చిన రేఖ, అవకాశాల కోసం ముంబైకి వెళ్లారు. అయితే అప్పట్లో ఆమె ఇప్పటి లాగా గ్లామరస్‌గా కనిపించేవారు కాదని పలువురు చెబుతుంటారు. ఆ సమయంలో ప్రముఖ నటుడు సంజయ్ ఖాన్ను కలిసిన రేఖకు ఊహించని షాక్ తగిలింది. ఆమెతో ఫోటోషూట్ చేయడానికి ఆయన మొదట అంగీకరించలేదట. ఈ విషయాన్ని సంజయ్ ఖాన్ కుమార్తె ఫరాహ్ ఖాన్ అలీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. రేఖ స్వయంగా తమ కుటుంబంతో ఈ సంఘటనను పంచుకున్నారని చెప్పారు. “ముంబైకి కొత్తగా వచ్చినప్పుడు నేను లావుగా ఉండేదాన్ని. అందంగా కనిపించేదానిని కాదు. మీ నాన్న నాతో ఫోటోషూట్ చేయడానికి ఒప్పుకోలేదు. కానీ నీ అమ్మ జరీన్ ఖాన్ మాత్రం నా కళ్లలో, నా ముఖంలో ప్రత్యేకమైన అందం ఉందని చెప్పి ఆయనను ఒప్పించారు అని రేఖ గుర్తుచేసుకున్నారు,” అని ఆమె చెప్పకు వచ్చింది. చివరకు జరిగిన ఆ ఫోటోషూట్ ఫోటోలు చూసిన సంజయ్ ఖాన్ ఆశ్చర్యపోయారట. ఈ అమ్మాయి కెమెరా ముందు అద్భుతంగా కనిపిస్తోంది అంటూ ఆమెతో సినిమా చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఆ తర్వాత రేఖ ఆయనతో కలిసి హసీనోం కా దేవతాలో నటించారు. అదే ఆమె బాలీవుడ్ కెరీర్‌కు కీలక మలుపు అయింది