
రేవంత్‌పై అత్యధికంగా 89, సువేందుపై 29.. చంద్రబాబు, డీకే శివకుమార్‌పై 19 చొప్పున కేసులు లోక్‌సభలో 251, రాజ్యసభలో 75 మంది పైనా.. దేశవ్యాప్తంగా ఎంపీలు, ఎమ్మెల్యేలపై మొత్తం 4,192 కేసులు పెండింగ్ సుప్రీంకోర్టుకు అమికస్ క్యూరీ హన్సారియా నివేదిక న్యూఢిల్లీ, ఆగస్టు 18: దేశంలోని 28 మంది ముఖ్యమంత్రుల్లో 14 మందిపై తీవ్ర ఆరోపణలతో క్రిమినల్ కేసులు నమోదై ఉన్నాయి. వీరిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, పశ్చిమబెంగాల్ సీఎంలు రేవంత్‌రెడ్డి, చంద్రబాబు, డీకే శివకుమార్, సువేందు అధికారి కూడా ఉన్నారు. ప్రధానంగా రేవంత్‌రెడ్డిపై అత్యధికంగా 89 కేసులు ఉన్నాయి. 29 కేసులతో సువేందు రెండో స్థానంలో ఉన్నారు. చంద్రబాబు, డీకేలపై చెరో 19 కేసులు, కేరళ సీఎం వీడీ సతీశన్‌పై 18 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని అమికస్ క్యూరీ, సీనియర్ న్యాయవాది విజయ్ హన్సారియా సోమవారం సుప్రీంకోర్టుకు అఫిడవిట్ రూపంలో నివేదిక సమర్పించారు. బీజేపీ నేత అశ్వినీకుమార్ ఉపాధ్యాయ్ దాఖలుచేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై సుప్రీంకోర్టు విచారణకు హన్సారియా సహకరిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఎంపీలు, ఎమ్మెల్యేలపై 4,192 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని ఆయన తన అఫిడివిట్‌లో తెలిపారు. ప్రస్తుత, మాజీ ప్రజాప్రతినిధులపై కేసుల విచారణను వేగవంతం చేయడానికి తక్షణమే ప్రత్యేక కోర్టులు నెలకొల్పాలని సర్వోన్నత న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. ఈ ట్రయల్స్‌ను క్రియాశీలంగా పర్యవేక్షించాలని సంబంధిత హైకోర్టులను కూడా ఆదేశించాలని కోరారు. ‘543 మంది ఎంపీల లోక్‌సభలో 251 మంది, వివిధ రాష్ట్రాల నుంచి రాజ్యసభకు ఎన్నికైన 233 మంది సభ్యుల్లో 75 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. ప్రజాప్రతినిధులపై ఉన్న కేసుల్లో 519 కేసులు పదేళ్లకుపైగా పెండింగ్‌లో ఉన్నాయి. 700 కేసుల్లో పోలీసులు అసలు దర్యాప్తే ప్రారంభించలేదు. చార్జిషీటు కూడా దాఖలు కాకుండా 360 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. కేరళకు చెందిన 95ు మంది ఎంపీలు తీవ్ర క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారు. తెలంగాణలో 82ు మంది ఎంపీలపై.. ఒడిసాలో 76ు మంది పార్లమెంటు సభ్యులపై కేసులు