
పదేళ్లు పాలన చేసినవారివి మాటలే రైతుల ఖాతాల్లో నేడు మరో 1,009 కోట్లు వానాకాలం రైతు భరోసా నిధుల జమ పూర్తి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వృత్తుల కన్నావ్యవసాయం మిన్న: తుమ్మల నేడు ఖమ్మం జిల్లాకు సీఎం రేవంత్‌రెడ్డి రైతు ఆశీర్వాద సభకు సర్వం సిద్ధం ఖమ్మం/చింతకాని(ఆంధ్రజ్యోతి), జూలై 9: ‘రాష్ట్ర ప్రభుత్వంపైన విమర్శలు చేస్తున్న పార్టీల వారు తిరిగి అధికారంలోకి వచ్చేది లేదు.. చేసేదీ లేదు. గతంలో పదేళ్లు పాలించిన వారివన్నీ మాటలే.. కానీ ప్రజాప్రభుత్వానివన్నీ చేతలే. అందుకే 9 రోజుల్లో రూ.9 వేల కోట్లు రైతుల ఖాతాలో జమ చేసిన దేశంలో ఏకైక ప్రభుత్వంగా.. ప్రజాప్రభుత్వం నిలుస్తుంది’ అని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. రైతు భరోసా విజయోత్సవాల్లో భాగంగా ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం చింతకాని మండలం జగన్నాథపురంలో శుక్రవారం రైతు ఆశీర్వాద సభ జరగనుంది. దీనికి సీఎం రేవంత్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. అదే ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మెగా రైతు మేళాను గురువారం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. రైతు మేళా సభలో, చింతకాని మండలం లచ్చగూడెంలో భట్టి విక్రమార్క విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని కష్టాలు ఎదురైనా రైతుల సంక్షేమం విషయంలో ప్రత్యేక శ్రద్ధతో పనిచేస్తోందని, విత్తనం వేసినప్పటి నుంచి పంట కొనుగోలు వరకు రైతులకు అండగా నిలుస్తోందన్నారు. దశాబ్దాల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వాలు నిర్మించిన నాగార్జున సాగర్, శ్రీరాంసాగర్, కడెం లాంటి ప్రాజెక్టులు నేటికీ రైతులకు సాగునీటిని అందిస్తున్నాయని.. గత ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం కుంగిపోడడం ఆ ప్రభుత్వ పాలనకు నిదర్శనమని విమర్శించారు. శుక్రవారం రైతు ఆశీర్వాద సభా వేదిక నుంచి రైతు భరోసాలో భాగంగా మిగిలిన రూ.1,009కోట్లను విడుదల చేస్తామని ప్రకటించారు. దాంతో వానాకాలానికి సంబంధించిన రైతు భరోసా నిధుల జమ ప్రక్రియ పూర్తవుతుందని వెల్లడించారు. రైతు భరోసా కింద