మిథునరాశిలో 'బుధాదిత్య యోగం'.. 16 వరకు ఈ రాశులను ఎవరూ ఆపలేరు
Actor ProfilePolitician

మిథునరాశిలో 'బుధాదిత్య యోగం'.. 16 వరకు ఈ రాశులను ఎవరూ ఆపలేరు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
మిథునరాశిలో 'బుధాదిత్య యోగం'.. 16 వరకు ఈ రాశులను ఎవరూ ఆపలేరు
Oneindia Telugu9 Oct 2026
మిథునరాశిలో 'బుధాదిత్య యోగం'.. 16 వరకు ఈ రాశులను ఎవరూ ఆపలేరు

జ్యోతిషశాస్త్రంలో గ్రహాల కదలికలకు, వాటి కలయికలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా నవగ్రహాలకు రాజైన రవి (సూర్యుడు), బుద్ధి కారకుడైన బుధుడు ఒకే రాశిలో కలిసినప్పుడు అత్యంత శక్తివంతమైన బుధాదిత్య యోగం ఏర్పడుతుంది. సాధారణంగా ఈ కలయిక ఏ రాశిలో జరిగినా సానుకూల మార్పులు ఉంటాయి. కానీ, ఈసారి జూలై 7 నుంచి 16 వరకు.. బుధుడికి సొంత రాశి అయిన మిథునరాశిలోనే ఈ అద్భుత యోగం ఏర్పడుతుండటంతో దీని శక్తి మరిన్ని రెట్లు పెరగనుంది.సమస్యల ఊబిలో కూరుకుపోయిన వారిని సైతం బయటపడేసి, రాజభోగాలు అందించే సత్తా ఈ యోగానికి ఉంది. జూలై 16 వరకు సాగే ఈ ప్రత్యేక గ్రహాల కూటమి వల్ల ముఖ్యంగా నాలుగు రాశుల వారికి కెరీర్, మనీ, పర్సనల్ లైఫ్‌లో ఊహించని అదృష్టం వరించబోతోంది. ఆ లక్కీ రాశుల వివరాలు తెలుసుకుందాం.ధనస్సు రాశి, మకర రాశివారికి బాగా కలిసిరావాలంటే ఏం చేయాలి?వృషభ రాశివృషభ రాశి వారికి ఈ యోగం ధన స్థానంలో ఏర్పడుతోంది. దీనివల్ల మీ ఆర్థిక, కుటుంబ పరిస్థితులు మునుపెన్నడూ లేనంతగా మెరుగుపడతాయి. షేర్ మార్కెట్, వ్యాపార పెట్టుబడుల్లో మీరు ఊహించిన దానికంటే అద్భుతమైన లాభాలు వస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో రాబడి ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్‌తో పాటు జీతం భారీగా పెరిగే ఛాన్స్ ఉంది. ఇంట్లో ఉన్న గొడవలు, సమస్యలు తొలగిపోయి సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి. సమాజంలో మీ మాటకు, చేతకు గౌరవం పెరుగుతుంది.మిథున రాశిమిథున రాశిలోనే ఈ బుధాదిత్య యోగం ఏర్పడుతుండటంతో ఈ రాశి వారికి డబుల్ బెనిఫిట్స్ ఉంటాయి. మీ ప్రతిభాపాటవాలు, శక్తిసామర్థ్యాలు బయటకు వస్తాయి. ఊహించని విధంగా ధన యోగాలు, రాజయోగాలు పట్టి మీ జీవనశైలి పూర్తిగా మారిపోతుంది. ఆర్థిక, వ్యక్తిగత ఇబ్బందుల నుంచి శాశ్వత ఉపశమనం లభిస్తుంది. గత కొంతకాలంగా వేధిస్తున్న ఆరోగ్య సమస్యలు కుదుటపడతాయి. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కచ్చితంగా శుభవార్తలు అందుతాయి. సమాజంలో ఉన్నతమైన వ్యక్తులతో పరిచయాలు