
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఒకే ఒక్క సమీక్షా సమావేశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా ప్రభుత్వంలో ఏ శాఖకు సంబంధించిన సమీక్ష జరగాలన్నా, ఆ శాఖా మంత్రి పాత్ర అత్యంత కీలకం. ముఖ్యమంత్రితో పాటు సంబంధిత మంత్రి కూడా ఆ సమావేశంలో కూర్చుని దిశానిర్దేశం చేయడం ఆనవాయితీ. కానీ, సోమవారం పర్యాటక రంగంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో సీన్ పూర్తిగా రివర్స్ అయింది. సంబంధిత మంత్రి జూపల్లి కృష్ణారావు లేకుండానే, కేవలం అధికారులతోనే సీఎం ఈ సమావేశాన్ని ముగించడం సచివాలయ వర్గాల్లో సంచలనం సృష్టించింది. హైదరాబాద్‌లో అధికారులు ఫైళ్లతో సీఎం ముందు హాజరై చర్చలు జరుపుతుంటే, అదే సమయంలో మంత్రి జూపల్లి కృష్ణారావు తన సొంత నియోజకవర్గంలో ఈతకొడుతూ కనిపించారు. ఈ సమీక్షా సమావేశం గురించిన కనీస సమాచారం కూడా మంత్రికి లేకపోవడం, ఆయనకు సీఎం ఆఫీస్ నుండి పిలుపు రాకపోవడంతోనే సొంత నియోజకవర్గంలో రిలాక్స్ అయ్యారనే చర్చ నడుస్తోంది. అయితే, ఈ వ్యవహారం కేవలం ఒక శాఖ సమీక్షకు పరిమితమైనది కాదని, దీని వెనుక రేవంత్ రెడ్డి మార్క్ పొలిటికల్ సిగ్నల్స్ ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావును ఈ సమీక్షా సమావేశానికి దూరం పెట్టడం వెనుక బలమైన కారణాలే ఉన్నాయని రాజకీయ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. ఇటీవల మంత్రి జూపల్లి తన పరిధి దాటి, ఆర్థిక విషయాలపై గత ప్రభుత్వ అప్పుల అంశాన్ని లేవనెత్తారు. దమ్ముంటే చర్చకు రావాలంటూ బీఆర్ఎస్ నేతలకు బహిరంగ సవాల్ విసిరారు. అయితే, ఈ సవాల్‌ను స్వీకరించిన మాజీ మంత్రి హరీశ్ రావు పక్కా ఆధారాలు, లెక్కలతో కౌంటర్ ఇచ్చేసరికి జూపల్లి గారు పూర్తిగా డిఫెన్స్‌లో పడిపోయారు. ముందస్తు వ్యూహం, సరైన సమాచారం లేకుండా సవాల్ విసిరి, పార్టీని, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టారనే కోపం సీఎం రేవంత్ రెడ్డికి గట్టిగానే వచ్చినట్టు సమాచారం. ఈ సెల్ఫ్ గోల్ వ్యవహారంతోనే