మా తాత తెలుగులో తోపు నటుడు.. కానీ నాతో మాట్లాడి 9ఏళ్లు అవుతుంది
Actor ProfileActor

మా తాత తెలుగులో తోపు నటుడు.. కానీ నాతో మాట్లాడి 9ఏళ్లు అవుతుంది

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
మా తాత తెలుగులో తోపు నటుడు.. కానీ నాతో మాట్లాడి 9ఏళ్లు అవుతుంది
TV9 Telugu20 Jan 2027
మా తాత తెలుగులో తోపు నటుడు.. కానీ నాతో మాట్లాడి 9ఏళ్లు అవుతుంది

నటి జోవిక ఈ ముద్దుగుమ్మ ఇటీవలే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అగాధ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది జోవిక. కాగా తాజాగా ఓ ఓఇంటర్వ్యూలో తన తాతయ్య, ప్రముఖ సీనియర్ నటుడు విజయకుమార్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. బాల్యం నుంచి తన సినీ ప్రయాణం వరకు విజయకుమార్ ప్రభావం, తన తల్లి వనితా విజయకుమార్ అందించిన అండదండల గురించి జోవిక అనేక విషయాలను పంచుకుంది. ముందుగా తన బాల్య జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ, చిన్నప్పుడు తన అమ్మమ్మ ఇంట్లో సుమారు 10-15 మంది కజిన్స్‌తో కలిసి సమ్మర్ హాలిడేస్‌లో గడిపిన క్షణాలను గుర్తుచేసుకుంది. "ఒక హోల్ ఫంక్షన్ లాగా ఉండేది. 10 నుండి 15 మంది పిల్లలు ఒకే చోట ఉంటే అదో గందరగోళమే, కానీ ఆ రోజులను ఎంతో ఆస్వాదించాను" అని జోవిక చెప్పుకొచ్చింది. చిరంజీవికి విలన్‌గా చేయడమే నాజీవితంలో అతి పెద్ద కోరిక.. నటుడి ఎమోషనల్ కామెంట్స్ అనంతరం, తన తాతయ్య విజయకుమార్‌తో ప్రస్తుత సంబంధం గురించి మాట్లాడుతూ, దాదాపు 8-9 సంవత్సరాలుగా ఆయనతో మాట్లాడలేదని తెలిపింది. మేము ఇప్పుడు కాంటాక్ట్‌లో లేము అని చెప్పినప్పటికీ, విజయకుమార్ పట్ల తనకున్న గౌరవం, ఆయన్నుండి నేర్చుకున్న విషయాల గురించి జోవిక చెప్పుకొచ్చింది. "ఆయనెక్కడ ఉన్నా బాగా ఉండాలని కోరుకుంటున్నాను. ఆయన నాకు బాగానే ఉన్నారని తెలుసు" అని తెలిపింది. అలాగే ప్రొఫెషనలిజం గురించి ఆయన నుండి చాలా నేర్చుకోవచ్చు. ఆయన అత్యంత ప్రొఫెషనల్ నటులలో ఒకరు. ఆయనంత అంకితభావం కలిగిన నటుడిని నేను ఎప్పుడూ చూడలేదు" అని జోవిక కొనియాడింది. విజయకుమార్ గెటప్‌లు, పాత్రలు, ఒక దర్శకుడి నటుడిగా, నిర్మాత నటుడిగా ఆయన అందించిన సహకారం ఎంతో గొప్పదని తెలిపారు. "ఆయనలాంటి నటులు మరెందరో ఉంటే బాగుండు అని కోరుకుంటున్నాను. ఆయన నుంచి నేను చాలా స్ఫూర్తి పొందుతాను. కనీసం కొంచమైనా ఆయనలా ఉండాలని ఆశిస్తున్నాను" అని జోవిక తెలిపింది