మ త్తు ఇచ్చి న టి
Actor ProfileActor

మ త్తు ఇచ్చి న టి

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
మ త్తు ఇచ్చి న టిపై అత్యాచారం.. ప్ర ముఖ ద ర్శ కుడు అరెస్ట్
Chitrajyothy23 Nov 2026
మ త్తు ఇచ్చి న టిపై అత్యాచారం.. ప్ర ముఖ ద ర్శ కుడు అరెస్ట్

అత్యాచారం కేసులో బాలీవుడ్ దర్శకుడు షకీల్ నూరానీ (73) అరెస్టయ్యారు. అత్యాచారం కేసులో బాలీవుడ్ (Bollywood) దర్శకుడు షకీల్ నూరానీ (73) (Shakeel Noorani) అరెస్టయ్యారు. పదేళ్ల క్రితం తనపై లైంగిక దాడికి పాల్పడ్డారంటూ 33 ఏళ్ల ఓ నటి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ చర్య తీసుకున్నట్లు సమాచారం. షకీల్ నూరానీ గ‌తంలో ‘బడే దిల్ వాలా’, ‘జోరు కా గులాం’ వంటి సినిమాలకు దర్శకత్వం వహించారు. అయితే.. తన తీయ‌బోయే కొత్త సినిమా విషయంలో చర్చించేందుకు రావాలని చెప్పి దర్శకుడు తనను ఇంటికి పిలిచినట్లు బాధితురాలు ఆరోపించారు. ఆమె ఫిర్యాదు ప్రకారం.. దర్శకుడి నివాసానికి వెళ్లిన తర్వాత తనకు మాదక ద్రవ్యాలు ఇచ్చారని, ఆ తర్వాత తనపై అత్యాచారానికి పాల్పడ్డారని ఆరోపించింది. ఈ ఘటన దాదాపు పదేళ్ల క్రితం జరిగినట్లు ఆమె పోలీసులకు తెలిపింది. తాజాగా ఆమె ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆరోపణల నేపథ్యంలో షకీల్ నూరానీని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు దర్యాప్తు కొనసాగుతున్న కొద్దీ వెల్లడయ్యే అవకాశం ఉంది. కాగా, షకీల్ నూరానీ బాలీవుడ్‌లో దర్శకుడిగా పలు చిత్రాలకు పనిచేశారు. ‘బడే దిల్ వాలా’, ‘జోరు కా గులాం’ వంటి సినిమాలతో ఆయనకు గుర్తింపు వచ్చింది. ప్రస్తుతం ఆయనపై నమోదైన అత్యాచారం కేసు బాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది