
ఏపీ శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ ఎన్నిక మరోసారి అధికార కూటమికీ, విపక్ష వైఎస్సార్సీపీకి మధ్య వైరానికి కేంద్రంగా నిలిచింది. ఈ మధ్యే ఖాళీ అయిన మండలి డిప్యూటీ ఛైర్మన్ పదవికి వైసీపీ తమ అభ్యర్ధిగా ఎమ్మెల్సీ


ఏపీ శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ ఎన్నిక మరోసారి అధికార కూటమికీ, విపక్ష వైఎస్సార్సీపీకి మధ్య వైరానికి కేంద్రంగా నిలిచింది. ఈ మధ్యే ఖాళీ అయిన మండలి డిప్యూటీ ఛైర్మన్ పదవికి వైసీపీ తమ అభ్యర్ధిగా ఎమ్మెల్సీ

ఏపీ రాజకీయాల్లో 2024 ఎన్నికలు పెను మార్పును తెచ్చాయి. అప్పటివరకూ 150కి పైగా ఎమ్మెల్యేలతో దుర్బేద్యంగా కనిపించిన వైసీపీ (YSrCP) కాస్తా ఎన్నికల ఫలితాల తర్వాత 11 సీట్లకు పడిపోయింది. అదే సమయంలో శాసనమండలిలో (AP Legislative Council) మాత్రం 50 ఎమ్మెల్సీలు ఉండటంతో పటిష్టంగా కనిపించింది. అయినా రాష్ట్రంలో కూటమి అధికారంలోకి రావడంతో.. మండలిపై వైసీపీ పట్టు కొనసాగించడం అంత సులువు కాదని అంతా భావించారు. కానీ రెండున్నరేళ్ల పాలన తర్వాత కూడా కూటమి మండలిపై పట్టు సాధించడంలో విఫలం కాగా.. వైసీపీ మాత్రం అదే పట్టు కొనసాగిస్తుండటం విశేషం.ఆ జిల్లాకు చంద్రబాబు పేరు..? సర్కార్ కు టీడీపీ ఎమ్మెల్యే డిమాండ్ ..!ఈ నేపథ్యంలో తాజాగా మండలి డిప్యూటీ ఛైర్మన్ ఎన్నిక వచ్చింది. గతంలో వైసీపీ మండలి ఛైర్మన్ గా గెలిపించుకున్న జకియా ఖానం.. కూటమి సర్కార్ అధికారంలోకి రాగానే ఆ పార్టీకి గుడ్ బై చెప్పేసి బీజేపీలో చేరిపోయారు. అయినా ఛైర్మన్ రూపంలో కొయ్యే మోషేన్ రాజు ఉండటంతో కూటమి ఫిరాయింపులు రాజకీయాలు పనిచేయలేదు. వైసీపీ నుంచి కూటమిలోకి ఆరుగురు ఎమ్మెల్సీలు ఫిరాయించినా వారిపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా మోషన్ రాజు సైలెంట్ గా ఉండిపోవడంతో చంద్రబాబు కూడా చేసేదేమీ లేకుండా పోయింది. ఇలాంటి పరిస్ధితుల్లో జకియా ఖానం పదవీకాలం ముగిసిపోయి మండలి డిప్యూటీ ఛైర్మన్ ఎన్నిక రావడంతో కూటమి కచ్చితంగా అభ్యర్ధిని నిలబెట్టి గెలిపించుకుంటుందని అంతా భావింంచారు. కానీ ఇక్కడా సీన్ రివర్స్ అయింది. ఏపీ మండలి ఛైర్మన్ ఎన్నిక ఏకగ్రీవం? ఒకే ఒక్క నామినేషన్ ..!వైసీపీ మండలి డిప్యూటీ ఛైర్మన్ పదవికి నిలబెట్టిన ఎమ్మెల్సీ తూమాటి మాధవరావుకు పోటీగా కూటమి నుంచి అభ్యర్దిని నిలబెట్టలేదు. దీంతో ఆయన ఏకగ్రీవంగా మండలి డిప్యూటీ ఛైర్మన్ కాబోతున్నారు. దీంతో మండలిలో ఛైర్మన్ గా కొయ్యే మోషేన్ రాజు, విపక్ష నేతగా బొత్స సత్యనారాయణ తర్వాత మూడో కీలక పదవిలోనూ మరో వైసీపీ