మూడోసారి అధ్యక్ష పోటీకి సై.. కానీ రాజ్యాంగం అడ్డొస్తోంది
Actor ProfilePolitician

మూడోసారి అధ్యక్ష పోటీకి సై.. కానీ రాజ్యాంగం అడ్డొస్తోంది

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
మూడోసారి అధ్యక్ష పోటీకి సై.. కానీ రాజ్యాంగం అడ్డొస్తోంది
AP7AM8 Dec 2026
మూడోసారి అధ్యక్ష పోటీకి సై.. కానీ రాజ్యాంగం అడ్డొస్తోంది

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన వ్యాఖ్యలతో అంతర్జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యారు. 2028లో మూడోసారి అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆసక్తి తనకు ఉన్నప్పటికీ, దేశ రాజ్యాంగ నిబంధనలు అందుకు అడ్డంకిగా ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు. ఇటీవల తన మద్దతుదారులు సభల్లో ‘ట్రంప్ 2028’ అంటూ నినాదాలు చేస్తున్న తరుణంలో, వాషింగ్టన్‌లో విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఆయన ఈ మేరకు స్పందించారు."ప్రతీ ఒక్కరూ నన్ను ఇదే అడుగుతున్నారు. సభల్లో '2028' అంటూ నినాదాలు చేస్తున్నారు. నిజానికి నాకు మళ్లీ పోటీ చేయాలని ఉంది. కానీ, ఈ విషయంలో అమెరికా రాజ్యాంగ చట్టాలు చాలా కఠినంగా ఉన్నాయి" అని ట్రంప్ పేర్కొన్నారు. అమెరికా రాజ్యాంగంలోని 22వ సవరణ ప్రకారం, ఒక వ్యక్తి రెండుసార్లకు మించి అధ్యక్షుడిగా ఎన్నికయ్యే అవకాశం లేదు. 2016, 2024 ఎన్నికల్లో గెలిచిన ట్రంప్‌కు ఇది రెండో పర్యాయం కావడం గమనార్హం.ఇదే సమయంలో, తన భద్రత, ప్రాణహానిపై కూడా ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. "దేశానికి మేలు చేసే ఏ ప్రభావవంతమైన అధ్యక్షుడికైనా బెదిరింపులు రావడం సహజం. ఏమీ చేయని నాయకులను ఎవరూ పట్టించుకోరు. నాకు బయటకు తెలియని ఎన్నో బెదిరింపులు వస్తుంటాయి" అని ఆయన అన్నారు. ఇటీవల తన టర్కీ పర్యటన సందర్భంగా సీక్రెట్ సర్వీస్, సైనిక బృందాలు అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశాయని గుర్తుచేశారు.అంతేకాకుండా, ఇరాన్‌పై మాట్లాడుతూ వ్యూహాత్మకంగా కీలకమైన హర్మూజ్ జలసంధి పూర్తిగా అమెరికా నౌకాదళం నియంత్రణలోనే ఉందని స్పష్టం చేశారు. తాను ఇరాన్‌ను ఎంతమాత్రం నమ్మబోనని తేల్చిచెప్పిన