మూడు రాచ కుటుంబాలకు వారసురాలు
Actor ProfileActor

మూడు రాచ కుటుంబాలకు వారసురాలు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
మూడు రాచ కుటుంబాలకు వారసురాలు, స్టార్ హీరోయిన్.. ఒక్క వీడియోతో జీవితం తల్లకిందులు
Samayam Telugu2 Oct 2026
మూడు రాచ కుటుంబాలకు వారసురాలు, స్టార్ హీరోయిన్.. ఒక్క వీడియోతో జీవితం తల్లకిందులు

విధి రాత అనుకూలించకపోతే ఎంతటి గొప్పవాళ్లయినా కాలప్రవాహంలో కన్నీటి చుక్కలుగా మిగిలిపోవాల్సిందే అనడానికి గ్లామర్ ప్రపంచంలో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. సినిమా రంగం అనేది కేవలం రంగుల ప్రపంచం మాత్రమే కాదు, అదొక నిప్పుల కొలిమి. ఇక్కడ అపారమైన కీర్తి ప్రతిష్టలు ఎంత వేగంగా లభిస్తాయో, ఒకే ఒక్క చిన్న పొరపాటు, వివాదం వల్ల అంతే వేగంగా పాతాళానికి పడిపోయే ప్రమాదం కూడా పొంచి ఉంటుంది. అలాంటి విషాదకరమైన జీవిత ప్రయాణాన్ని ఎదుర్కొన్న నటి రియా సేన్. ఆమె కేవలం గ్లామర్ ప్రపంచంలో మెరిసిన ఒక సాధారణ తార మాత్రమే కాదు.. భారతీయ చరిత్ర పుటల్లో సువర్ణాక్షరాలతో లిఖించబడిన అత్యంత ప్రభావవంతమైన మూడు రాజకుటుంబాల వారసురాలు.నరనరాల్లో రాచరికపు వైభవం రియా సేన్ కుటుంబ నేపథ్యం గురించి వింటే ఎవరైనా సరే ఆశ్చర్యపోవాల్సిందే. ఆమె నేపథ్యం వెనుక మూడు శక్తివంతమైన రాచరిక కుటుంబాల మూలాలు ఉన్నాయి. కూచ్ బెహార్, త్రిపుర, జైపూర్ రాజవంశాల రక్తం ఆమె నరనరాల్లో ప్రవహించింది. ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత అందగత్తెగా, అంతర్జాతీయ ఫ్యాషన్ ఐకాన్‌గా గుర్తింపు పొందిన జైపూర్ మహారాణి గాయత్రీ దేవి.. రియా సేన్‌కు స్వయానా అమ్మమ్మ. ఇక సినీ రంగానికి వస్తే.. బెంగాలీ చిత్ర పరిశ్రమను శాసించిన మహానటి సుచిత్ర సేన్ మనవరాలిగా, తెలుగులో 'సిరివెన్నెల' వంటి క్లాసిక్ చిత్రంతో పాటు హిందీ, బెంగాలీ భాషల్లో స్టార్ హీరోయిన్‌గా వెలిగిన మూన్ మూన్ సేన్ కుమార్తెగా రియా సేన్ వెండితెరకు పరిచయమయ్యారు. ఇంతకంటే గొప్ప పుట్టుక, ఇంతకంటే అద్భుతమైన పోలికలు బహుశా ఏ నటికీ సాధ్యం కాకపోవచ్చు.* రోడ్డు మీద సిగరెట్ పీకలు ఏరుకుని తాగేవాడు - ఆకలి, అవమానాలే ఆయన్ని సూపర్‌స్టార్‌ని చేశాయ్ఆకాశమంత అంచనాలుఇలాంటి రాచరికపు సొగసు, వారసత్వ గర్వంతో పెరిగిన రియా సేన్.. చిన్నతనం నుంచే గ్లామర్ ప్రపంచం వైపు ఆకర్షితులయ్యారు. 1991లో బాలనటిగా కెమెరా ముందుకు వచ్చిన ఆమె, 2001లో విడుదలైన ‘స్టైల్’ అనే