మండాడి’లోని తెలుసా నీకే పిల్లా’ సాంగ్ ఎలా ఉందంటే
Actor ProfileActor

మండాడి’లోని తెలుసా నీకే పిల్లా’ సాంగ్ ఎలా ఉందంటే

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
మండాడి’లోని తెలుసా నీకే పిల్లా’ సాంగ్ ఎలా ఉందంటే
Chitrajyothy6 Jan 2027
మండాడి’లోని తెలుసా నీకే పిల్లా’ సాంగ్ ఎలా ఉందంటే

వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్న టాలెంటెడ్ హీరో సుహాస్, విలక్షణ నటుడు సూరి ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న తాజా భారీ చిత్రం ‘మండాడి’. ఈ మూవీ నుంచి ‘తెలుసా నీకే పిల్లా’ సాంగ్‌ని మేకర్స్ వదిలారు. వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్న టాలెంటెడ్ హీరో సుహాస్ (Suhas), విలక్షణ నటుడు సూరి (Soori) ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న తాజా భారీ చిత్రం ‘మండాడి’ (Mandaadi). ఎల్రెడ్ కుమార్ సమర్పణలో ఆర్ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ బ్యానర్‌పై మతిమారన్ పుగళేంది దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఎల్రెడ్ కుమార్ స్వయంగా నిర్మిస్తోన్న ఈ చిత్రంలో సత్యరాజ్, రవీంద్ర విజయ్, మిథున్, బాల శరవణన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్లు సినిమాపై భారీ అంచనాలను పెంచగా.. సూరి, సుహాస్ కొత్త మేకోవర్‌తో పాటు పీటర్ హెయిన్, దిలీప్ సుబ్బురాయన్ కంపోజ్ చేసిన యాక్షన్ సీక్వెన్స్‌లు చిత్రానికి ప్రధాన బలంగా నిలవనున్నాయి. తాజాగా ఈ మూవీ నుంచి ‘తెలుసా నీకే పిల్లా’ (Telusa Neeke Pilla) అనే సోల్‌ఫుల్ మెలోడీ ప్రేమ గీతాన్ని చిత్రయూనిట్ విడుదల చేసింది. సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ స్వరపరిచిన ఈ మెలోడీ సాంగ్ సంగీత ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ప్రముఖ గేయ రచయిత కాసర్ల శ్యామ్ అందించిన సాహిత్యం మనసును హత్తుకునేలా ఉండగా, కృష్ణ తేజస్వీ, రేష్మ శ్యాం తమ మధురమైన గాత్రంతో పాటకు ప్రాణం పోశారు. ఈ లిరికల్ వీడియోలో సూరి, మహిమా నంబియార్ మధ్య సాగే ప్రేమకథను ఎంతో అందంగా, ఆహ్లాదకరంగా చూపించారు. జీవీ ప్రకాష్ అందించిన ఆహ్లాదకరమైన బాణీలు, ఎస్.ఆర్. కథిర్ విజువల్స్ వెరసి ఈ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో విశేష ఆదరణ పొందుతూ శ్రోతల ప్లేలిస్ట్‌లో చేరిపోయింది. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 10న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. తెలుగులో అగ్ర