మెడికో ప్రియాంక మృతి.. ధ్రువీకరించిన కిమ్స్ వైద్యులు
Actor ProfileCelebrity

మెడికో ప్రియాంక మృతి.. ధ్రువీకరించిన కిమ్స్ వైద్యులు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
మెడికో ప్రియాంక మృతి.. ధ్రువీకరించిన కిమ్స్ వైద్యులు
Eenadu21 Nov 2026
మెడికో ప్రియాంక మృతి.. ధ్రువీకరించిన కిమ్స్ వైద్యులు

హైదరాబాద్‌: రాజమహేంద్రవరం ఘటనలో తీవ్రంగా గాయపడిన వైద్య విద్యార్థిని ప్రియాంక మృతిచెందారు. చికిత్స పొందుతూ ఆమె మృతిచెందినట్లు సికింద్రాబాద్‌ కిమ్స్‌ వైద్యులు ధ్రువీకరించారు. ఆదివారం మధ్యాహ్నం 3.25 గంటలకు ప్రియాంక తుదిశ్వాస విడిచినట్లు వెల్లడించారు. ప్రియాంక స్వస్థలం జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలం ఏక్లాస్‌పూర్. ఎంబీబీఎస్‌ పూర్తిచేసిన ఆమె.. తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలోని జీఎస్‌ఎల్‌ వైద్య కళాశాలలో డెర్మటాలజీ విభాగంలో పీజీ మొదటి సంవత్సరం చదువుతున్నారు. తల్లిదండ్రులు హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. ప్రియాంక ఈ నెల 3న రాత్రి రాజమహేంద్రవరం ప్రసాద్‌ ఆదిత్యమాల్‌లో సినిమా చూసి, సహచర విద్యార్థి ఉమేష్‌తో కలిసి ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. రద్దీ కారణంగా వాహనాలు థియేటర్‌ గేటు వద్ద ఆగగా.. అదే సమయంలో నామవరానికి చెందిన సురవరపు దుష్యంత్, లాలాచెరువుకు చెందిన ఆండ్రూ విలియం జోసెఫ్‌లు మద్యం మత్తులో కారు వేగంగా నడుపుతూ వచ్చి వీరి బైక్‌ను ఢీకొట్టారు. తరువాత మరో రెండుసార్లు బలంగా ఢీకొట్టి.. పైనుంచి కారు వెళ్లడంతో కిందపడిపోయిన ప్రియాంక తలకు తీవ్ర గాయమైంది. ఆమెను స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. పరిస్థితి విషమించడంతో బుధవారం సికింద్రాబాద్‌లోని కిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆమె చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. విజయవాడలోని అంబేడ్కర్‌ కళావేదికలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి నిర్మాణ పనులు జోరుగా సాగుతున్నాయి