
రాజమహేంద్రవరంలోని ప్రసాద్ ఆదిత్యమాల్ వద్ద సీన్ రీకన్‌స్ట్రక్షన్ ఏఎస్పీ పాటిల్ ఆధ్వర్యంలో విచారణ నేరం అంగీకరించినట్లు సమాచారం నిందితులను వైద్య పరీక్షల కోసం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చిన పోలీసులు ఈనాడు, రాజమహేంద్రవరం; న్యూస్‌టుడే, కంబాల చెరువు: మద్యం మత్తులో రాజమహేంద్రవరంలోని ప్రసాద్ ఆదిత్యమాల్ వద్ద కారును వేగంగా నడుపుతూ వైద్య విద్యార్థిని ప్రియాంక మృతికి కారణమైన నిందితులను పోలీసులు బుధవారం కస్టడీకి తీసుకున్నారు. ఈ నెల 3వ తేదీ రాత్రి పీజీ వైద్య విద్యార్థుల ద్విచక్ర వాహనాన్ని ఉద్దేశపూర్వకంగా మూడుసార్లు ఢీకొట్టి.. ప్రియాంక ముఖం పైనుంచి కారు పోనివ్వడంతో ఆమె తీవ్రగాయాల పాలై, చికిత్స పొందుతూ 9న మృతి చెందిన విషయం తెలిసిందే. సంచలనం సృష్టించిన ఈ కేసుకు సంబంధించి రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఉన్న నిందితులు సురవరపు దస్వంత్ (24), ఆండ్రూ జోసెఫ్ ఎడ్వర్డ్స్(23)లను బుధవారం ఉదయం 11.55 గంటలకు పోలీసులు తమ కస్టడీకి తీసుకుని జీజీహెచ్‌కు తరలించారు. వారికి వైద్య పరీక్షలు నిర్వహించాక ప్రకాశంనగర్ పోలీసుస్టేషన్‌కు, ఆ తరవాత బొమ్మూరు తరలించారు. ఏఎస్పీ(అడ్మిన్) దేవరాజ్ పాటిల్, సీఐ బాజీలాల్ తదితరులు విచారించారు. మాల్ సిబ్బందితో గొడవ, నిర్లక్ష్యంగా కారు నడపడం, ఉద్దేశపూర్వకంగా మెడికోల ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడం వంటివాటిపై ప్రశ్నించగా వారు నేరాన్ని అంగీకరించినట్లు సమాచారం. రాజమహేంద్రవరంలోని ప్రసాద్ ఆదిత్యమాల్‌లోకి బుధవారం సాయంత్రం నిందితులను పోలీసులు తీసుకెళ్లి.. ఆ రోజు ఏం జరిగిందో తెలుసుకునేందుకు సీన్ రీకన్‌స్ట్రక్ట్ చేశారు. మధ్యాహ్నం 3.34 గంటలకు మాల్ కుడి మార్గం నుంచి అదనపు ఎస్పీతోపాటు మరో పదిమంది అధికారులు, సిబ్బంది నిందితులతో లోపలికి చేరుకున్నారు. బేస్‌మెంట్-2 నుంచి లిఫ్ట్ మార్గంలో మూడో అంతస్తుకు వెళ్లి ఫుడ్ కోర్టులో నిందితులిద్దరూ బిర్యానీ తిన్న కౌంటర్ వద్ద వివరాలు సేకరించారు. ఎవరితోనైనా గొడవ పడ్డారా అని ఆరా తీశారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని